Thursday, 19 March 2026

Blog

విశాఖపట్నం

భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయిబాబా వారి 100 వ జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*

*భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయిబాబా వారి 100 వ జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* పెందుర్తి నియోజకవర్గంలో జీవీఎంసీ 97వ వార్డు చిన్నముసిడివాడ గ్రామం సత్యసాయి మందిరంలో నూ, సుజాతనగర్ భగవాన్ శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆనంద సాయి మందిరంలోను మరియు ఉక్కునగరం స్టీల్ ప్లాంట్ సెక్టర్ 2 లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మందిరం కమిటీ వారి ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబా వారి వందవ జన్మదిన వేడుకలలో పాల్గొని కరుణ దయ మానవ ధర్మానికి ప్రత్యేకగా నిలిచిన దైవం శ్రీ సత్య సాయి బాబా గారి నిస్వాద సేవలను స్మరించుకుంటూ సేవా మార్గంలో నడుస్తున్న భక్తులందరికీ స్వామి వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్యసాయిబాబా వారి మందిరాలలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలలో పాల్గొని కుట్టు మిషన్ల పంపిణీ మరియు పేదలకు బట్టలు మరియు కుర్చీల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు వీరితోపాటు స్థానిక వార్డు కార్పొరేటర్ శ్రీమతి శ్రీ వసంత శంకర్రావు గారు, పంచకర్ల ప్రసాద్ రావు గారు,77 వార్డు కార్పొరేటర్ బుట్ట సూర్యా కుమారి గారు,ముక్కా సంతోష్ గారు, ముక్కా గోపి గారు,తైనాల మహేష్ గారు,పిల్లా జగన్మోహన్ పాత్ర గారు, ఏఎంసీ డైరెక్టర్ లక్కీ గోవింద్ గారు, ముమ్మన సతీష్ గారు,నీటిపల్లి మహేష్ గారు, బిగిడి రామ గోవింద గారు, వెన్నెల నరసింహారావు గారు వియ్యపు చిన్న గారు, సిరపరపు అప్పలనాయుడు గారు,కాకి బాబు గారు, కెఎన్ఆర్ గారు, లక్కవరపు శ్రీనివాసరావు గారు, గోపి గారు, సతివాడ జ్యోతి గారు,రాపర్తి కిషోర్ గారు, తనకాల శ్రీనివాసరావు గారు, బసనబోయిన రాము గారు, బల్రెడ్డి సతీష్ గారు , నాగసుధ గారు, వరూధిని గారు, కర్రీ శివ గారు, వెంకటేశ్వరరావు గారు, మొదలగు సత్య సాయిబాబా భజన మండలి సభ్యులు ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

కన్యకాపరమేశ్వరి ఆలయ జీర్ణోద్ధరణ*

*కన్యకాపరమేశ్వరి ఆలయ జీర్ణోద్ధరణ* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* * గర్భాలయంలో అమ్మవారి మూలవిరాట్ ను స్ప్రుశించుకుని దర్శనం * ఆవుతో దర్భముడితో విగ్రహం గవ్యాంత మార్జనలు * జీర్ణోద్దరణ మరియు కలాపకర్షణ * బాలాలయంలో అమ్మవారి ప్రతిష్టాపన విశాఖ నగరంలో కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల 149 సంవత్సరాల చరిత్ర గలిగిన దేవాలయం పునరుద్ధరణ సందర్భంగా ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ జీర్ణోద్దరణ మరియు కలాపకర్షణ గావించి నూతనంగా ఏర్పాటు చేసిన బాలాలయంలో అమ్మవారిని ప్రతిష్టించినట్లు దేవాలయ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు *శ్రీయుతులు ఆరిశెట్టి దినకర్, పెనుగొండ కామరాజు, కోశాధికారి దోమా వెంకట బాలాజికుమార్* లు తెలిపారు. విశాఖ నగరంలో రోడ్డు విస్తరణలో భాగంగా 2023వ సంవత్సరంలో దేవాలయానికి సంబందించి సుమారు 16 అడుగుల్లో గల ఆలయ ముఖద్వారం, ధ్వజస్తంభం, నవగ్రహ మండపం కోల్పోయిన కారణంగా పూర్తి ఆలయం పునర్నిర్మించవలసినందువల్ల అగనంపూడి వాస్తవ్యులు విద్వాన్ శ్రీ శ్రీ శ్రీ కొత్తలంక పల్లంరాజు గారి మార్గదర్శకత్వంలో దేవాలయ ప్రధాన అర్చకులు ఆర్.బి.బి. కుమార్ శర్మ గారి నేతృత్వంలో ఆగమశాస్త్ర ప్రకారం విగ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశన, మర్జనలు, మండపారాధన, ప్రధాననకలశారాధన, త్రిశూలపూజ, కరణ్యాశములు, వాస్తుహోమం, వాస్తు బలి ఇత్యాది క్రతువులు నిర్వహించిన పిదప వాసవి అమ్మవారి మూలవిగ్రహ ఉద్వాసన (నిర్మూలన), ఆవుతో దర్భముడితో విగ్రహ గవ్యాంతమార్జనలు, బాలాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, వాసవి మూలమంత్ర హోమం, జీర్ణోద్దరణ మరియు కలాపకర్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ సుమారు ఏడు కోట్ల రూపాయలతో నగర ఆర్యవైశ్య లబ్దప్రతిష్టులు, వ్యాపార ప్రముఖులైన పైడా కృష్ణ ప్రసాద్, కంకటాల మల్లిక్ ల సంయుక్త ఆధ్వర్యాన ఆర్యవైశ్యుల విరాళాలతో పునర్నిర్మిస్తున్నట్లు తెలిపారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం పునరుద్ధరణ సందర్భంగా గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు మరియు భక్తులందరికీ మధ్యాహ్నం మహా అన్నప్రసాదం దేవాలయ కమిటీ అందజేశారు.

అమరావతి

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి*

అమరావతి నవంబర్ విశాఖ పున్నమి ప్రతినిధి:- *అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి* *42 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ ప్రభుత్వ బాలికల అంధుల రెసిడెన్షియల్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కరుణ కుమారి* *మ్యాచ్ లో కరుణ కుమారి చూపిన ప్రతిభ రాష్ట్రానికే గర్వకారణం* *కరుణ కుమారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు* *మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి* *అమరావతి,దివ్యదర్శిని న్యూస్* అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు గెలుపుపై రాష్ట్ర దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ….. ఫైనల్‌లో నేపాల్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలు. జట్టు సభ్యుల సమిష్టి కృషి, అకుంఠిత దీక్ష, పట్టుదలతో విజయం సాధించారు.ఈ మ్యాచ్ లో 42 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖలోని ప్రభుత్వ బాలికల అంధుల రెసిడెన్షియల్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని పంగి కరుణ కుమారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు. కరుణ కుమారికి సహకరించిన పాఠశాల సిబ్బందికి అభినందనలు. కరుణ కుమారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రికెట్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి అన్ని విధాల ప్రోత్సహించాం. ఈ మ్యాచ్ లో కరుణకుమారి చూపిన ప్రతిభ రాష్ట్రానికే గర్వకారణం. విభిన్న ప్రతిభావంతుల ప్రతిభను గుర్తించి వారికి అన్ని విధాల కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందనేదానికి ఇదే నిదర్శమని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Blog

రేపు నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం*

*రేపు నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం* నేటితో ముగిసిన సీజేఐ జస్టిస్ గవాయ్ పదవీకాలం.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసి జస్టిస్ సూర్యకాంత్.. 2027 ఫిబ్రవరి 9 వరకూ సీజేఐగా ఉండనున్న జస్టిస్ సూర్యకాంత్….

Blog

సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతరం వేడుకల్లో సీఎం చంద్రబాబు

*శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతరం వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ….* పుట్టపర్తి నవంబర్ విశాఖ పున్నమి ప్రతినిధి:- • 1926 నవంబర్ 23వ తేదీన భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమిలో ఒకలక్ష్యం కోసం అవతరించారు. • ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవనప్రయాణాన్ని సాగించి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించారు. జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారు • సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తిమార్గంతో కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. • 8 ఏళ్ల వయసు నుంచే ప్రార్థనలు, కీర్తనలు, భజనలతో దైవ చింతన కలిగిన వ్యక్తిగా వ్యవహరించేవారు. • 1940 మే 23న సత్యసాయి వయసు 14 ఏళ్లు…అప్పుడే ఆయన సత్యనారాయణరాజుగా ఉన్న పూర్వాసన నామాన్ని వదలుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. • దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారు. • శ్రీ సతస్యాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు. • చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్యానికి నిలయంగా మార్చారు. • మావన రూపంలో మనం చూసిన దైవమే సత్యసాయి బాబా • బాబా శత జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం అందరి అదృష్టం. • లవ్ ఆల్, సర్వ్ ఆల్వ్..హెల్ప్ ఎవర్, హర్ట నెవర్ అని సత్యసాయి బోధించారు. • సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా సిద్ధాంతాలతో నూతన అధ్యాయం ప్రారంభించారు • 1960లో బాబా స్థాపించిన సత్యసాయి సంస్థలతో సేవలకు రూపం వచ్చింది. • విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంక్షేమాన్ని కోరుకున్నారు. • భగవాన్ మనోదర్శనం ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు, ప్రముఖులు వచ్చి ఆయన సేవా మార్గాన్ని అనుసరించారు. • ఎవరూ పిలవకున్నా వారంతట వారే వచ్చి బాబా సిద్ధాంతాన్ని పాటించారు. డబ్బు, పేరు, పదవి ఉన్నా ఎక్కడా లేని ప్రశాంతత పుట్టపర్తిలో అందుకున్నారు. • ఆయన లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది. ప్రశాంతి నిలయం ఒక ఎనర్జీ సెంటర్. • శతజయంతితో పాటు ఈ రోజు మరో విశిష్టత ఉంది. • ఈ ప్రశాంతి నిలయం నిర్మించి నేటికి 75 ఏళ్లు. • ఆధ్యాత్మిక సంబరాలకు ఈ నిలయం వేదికైంది. భక్తుల బాధలకు, కష్టాలకు పరిష్కారం చూపే నిలయంగా మారింది. • మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా… సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరించారు. • విద్య నుంచి వైద్యం వరకూ, తాగునీటి నుంచి మానసిక సంతృప్తి వరకూ అందరికీ దక్కేలా చేశారు. • దేశ విదేశాల్లో ట్రస్టు ద్వారా సేవలందించారు. • 102 సత్యాసాయి పాఠశాలల్లో 60 వేలమంది విద్యార్థులు చదవుకుంటున్నారు.. వారికి ఉచిత విద్య అందిస్తున్నారు. • ట్రస్ట్ ఆస్పత్రుల ద్వారా 3 వేల మందికి ప్రతిరోజూ వైద్య సేవలు అందిస్తున్నారు. • దాహార్తిని తీర్చడానికి రూ.550 కోట్లతో ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 16 వందల గ్రామాల్లో 30 లక్షల మందికి పైగా నీరు అందిస్తున్నారు. • చెన్నై డ్రికింగ్ మోడరేజేషన్‌కు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారు. • సత్యసాయి ట్రస్ట్ 140 దేశాలు, 2 వేల కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్నేషన్ ఆర్గనేజేషన్ 10 జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని, సేవలను ముందుకు తీసుకెళ్తోంది. • చాలా గర్వపడుతున్నా… సత్యసాయికి ఈ రోజు 7.50 క్షల మంది సేవా సభ్యులు ఉన్నారు. • ఆయన సేవలను వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. • తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నా. • సత్యసాయి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బాబా ఇక్కడికి రప్పించారు. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. • వసుధైక కుటుంబం భారతీయులకు మూలం. సత్యసాయి బోధనల ద్వారా దాన్ని నిలబెట్టుకుందాం.

Blog

కొత్త ప్రపంచానికి కొత్త ఐక్యరాజ్యసమితి అవసరం: రాజ్ నాథ్ సింగ్*

*కొత్త ప్రపంచానికి కొత్త ఐక్యరాజ్యసమితి అవసరం: రాజ్ నాథ్ సింగ్* న్యూఢిల్లీ నవంబర్ విశాఖ పున్నమి ప్రతినిధి:- ప్రపంచ సంఘర్షణలను పరిష్కరించడానికి నేటి కొత్త ప్రపంచానికి కొత్త ఐక్యరాజ్యసమితి అవసరమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. లక్నోలో జరిగిన ప్రపంచ ప్రధాన న్యాయమూర్తుల అంతర్జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇజ్రాయెల్-హమాస్, ఉక్రెయిన్-రష్యా వంటి సంఘర్షణలు, సూడాన్‌లో మానవతా సంక్షోభాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి పాత్రపై ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థను సజీవంగా ఉంచడానికి సమతుల్య ప్రాతినిధ్యం, ప్రస్తుత కాలానికి అవసరమైన మార్పులు రావాలని ఆయన సూచించారు….

విశాఖపట్నం

కోవిడ్-19 టీకా పనితనం పై బహు పరిశోధనలు

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *ఆంధ్రవిశ్వవిద్యాలయం లో పి.జి చదువుతున్న ఒక విద్యార్థుల బృందం గత రెండున్నర సంవత్సరాలుగా కోవిడ్-19 టీకా పనితనం పై బహు పరిశోధనలు చేసి, ఇటీవలే కరోనా వైరస్ కోవిడ్-19 టీకా నుండి తప్పించుకొనే ఒక నూతన విధానాన్ని కనుగొన్నారు. టీక్యాబ్స్- ఇ ప్రయోగశాల వ్యవస్థాపకులు ప్రొఫెసర్ రవికిరణ్ యేడిది ఈ విద్యార్థుల బృందాన్నికి మార్గదర్శకత్వం వహించారు.* ఈ నూతన ఆవిష్కరణలను గురించి మాట్లాడుతూ కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ లో కొన్ని భాగాలు అస్థిరత్వం కలిగి ఉండడం వలన అవి ఘనపదార్ధాలుగా కాకుండా క్షణిక కాలం పాటు ద్రవ స్థితిలోకి పరివర్తనం చెందుతాయని అందువలన మనం తీసుకున్న కోవిడ్-19 టీకా ప్రభావం తో శరీరం లో ఉత్ప్పతైనా ప్రతిరోధకాలు అయోమయ పరిస్థితిలో వైరస్ ను నిరోధించే సామర్ధ్యాన్ని కోల్పోతాయి అని ప్రొఫెసర్ రవికిరణ్ యేడిది చెప్పారు. తన బృందం లోని విద్యార్థులందరూ అహర్నిశలు కష్టపడి ఈ విజయాన్ని సాధించారని ప్రొఫెసర్ రవికిరణ్ గర్వం గా చెప్పారు. ముఖ్యంగా మణికంఠ సోడసాని(M.Pharm), అభినవ్ గ్రంధి (Pharm.D), నిహారిఖ మూకల(M.Sc), జాహ్నవి చింతలపాటి (M.SC), మాధురి విస్సాప్రగడ (M.Sc), వరుసగా బయోఫిసిక్స్, కంప్యూటర్ సీములేషన్స్, మోలెక్యూలర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ మరియు జీన్ క్లోనింగ్ ప్రయోగాలు చెయ్యగా మధుమిత అగ్గున్న (M.S) పలు సాఫ్ట్వేర్ పద్ధతులను ఈ ప్రయోగాలు తో జోడించడం జరిగింది. ఈ తరహా బహుళ విభాగ సమ్మేళన పరిశోధనల వలన ఇటువంటి ఫలితాలను సాధించటమేకాక ఇటీవల ప్రతిష్టాత్మక ఎల్సేవియర్ అంతర్జాతీయ శాస్త్రీయ పత్రిక BBA లో ప్రచురించటం జరిగింది. భవిష్యతులో కోవిడ్-19 టీకా సమర్ధతను పెంచడానికి కృత్రిమమేధా మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాలను బయోటెక్నాలజీతో కలిపితే కానీ సాధ్యం కాకపోవచ్చునని ప్రొఫెసర్ రవికిరణ్ యేడిది అన్నారు. *ఈ నూతన ఆవిష్కరణను సాధించినందుకు ప్రొఫెసర్ రవికిరణ్ ను మరియు ఆయన విద్యార్థి బృందాన్ని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ అభినందించారు.*

నాగర్‌కర్నూల్

ఆ మండలంలో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు పై ఆగ్రహం

వెల్దండ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో బీసీ సంఘం నేతలు, బీసీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు 50 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టం చేయడంతో బీసీల ఆశలపై గండి పడింది. కనీసం గతంలో ఉన్న స్థానాలు అయినా వస్తాయని భావించిన వెల్దండ మండల బీసీల ఆశలు అడియాశలయ్యాయి. మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవుల రిజర్వేషన్‌లో కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. జనరల్‌—10, ఎస్సీ—5,ఎస్టీ—13, బీసీ—4, జనరల్ , 100 శాతం ఎస్టీలు ఉన్న తండాలకు రిజర్వు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బీసీ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టైంది వెల్దండ మండల సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియ” అని వ్యాఖ్యానిస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్ వస్తుందని ఆశపడితే, ఉన్న రిజర్వేషన్‌లోనే కోత పడుతుందని ఎవరూ ఊహించలేదు. వెల్దండ మండలంలో 2019 సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 6 స్థానాలు కేటాయిస్తే, 2025లో 42 శాతం ప్రకారం 10 స్థానాలు రావాల్సి ఉంది. అయితే ఈ రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో, ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో బీసీలకు కేవలం 4 గ్రామాల్లోనే రిజర్వేషన్ కేటాయించడం స్థానికులలో ఆశ్చర్యానికి, ఆగ్రహానికి కారణమైంది.

సాహితీ

బడిబాట (పాట) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

ప- అక్షరాలు దిద్దగా లక్షణాలు అబ్బగ ఎక్కాలు నేర్చగ ప్రగతి బాట పట్టగ చదువులమ్మ పిలుస్తుంది తన ఒడికి వెళదాము రండి మనం మన బడికి (అక్ష) చ1- కోయిలమ్మ పాడుతున్న రాగాల తీరుగ పంతులమ్మ చెబుతున్న పాఠాలు వినగ వినయ విధేయతలు కల్గి సద్విద్య ఒంటబట్టి సంక్షేమ సమాజాన సజ్జనుడివి కాగ (అక్ష) చ2- భరత భూమి గడ్డమీద నడవాలి సరిగ నేర్పుతుంది మనబడి జీవించ నిండుగ పరిసరాల విజ్ఞానం విచక్షనే చైతన్యం విజ్ఞాన సముపార్జన నీ లక్ష్యం అవగ (అక్ష)*

రంగారెడ్డి

రేపు ఎల్లంపల్లికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాక.. — ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్నీ పరామర్శించడానికి కదిలి వస్తున్న ఎమ్మార్పీఎస్ దండు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామాన్ని సోమవారం ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సందర్శించనున్నారు. ఇటీవలే కుల దృహంకార హత్యకు గురైన ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దళితుడు ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నరసింహ మాదిగ తెలిపారు. కుల దృహంకార హత్యకు గురై అసువులు బాసిన ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా పూర్తిస్థాయి న్యాయం జరిగి అదే విధంగా అంతకులకు కఠిన శిక్ష పడేందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కార్యాచరణలో భాగంగా గ్రామాన్ని సందర్శించి ఎర్ర రాజశేఖర్ భార్య వాణి అదేవిధంగా తండ్రి మల్లేష్ తదితరు కుటుంబ సభ్యులను ఆయన స్వయంగా పరామర్శిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ హత్య కేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. కేసు విచారణ కొనసాగుతోంది. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా తీర రాజశేఖర్ కుటుంబాన్ని సందర్శించి పరామర్శించింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా నాలుగు లక్షల 12 వేల రూపాయల చెక్కును అందజేసింది. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబ ఖర్చుల నిమిత్తం తన సొంతంగా 50వేల రూపాయలు అందజేశారు. ఇంకా ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున రాజశేఖర్ కుటుంబానికి అండగా నిలిచాయి. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగ రాక సందర్భంగా మరోసారి ఎల్లంపల్లి గ్రామం వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా ఎమ్మార్పీఎస్ దండు ఎల్లంపల్లి గ్రామానికి కదిలి వస్తుంది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.