Wednesday, 18 March 2026

Blog

తిరుపతి

ప్రజల సమస్యలకు 15 రోజుల్లోనే పరిష్కారం… ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నవంబర్ 28, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని పంచాయతీరాజ్ అతిధి గృహంలో శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ వేదిక ద్వారా ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించాల్సిందిగా ఆదేశించడం జరిగినది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…నియోజకవర్గంలో కొత్త రకంగా గ్రీవెన్స్ కి సంబంధించి ఒక ఫామ్ రూపొందించడం జరిగిందని ఈ ఫామ్ సంబంధింత అధికారులకు పంపి 15 రోజుల్లో దానిని పరిష్కరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరందరు సమీపంలో నిర్మించిన టిటిడి కళ్యాణమండపంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫేక్ మెసేజ్లను యాప్లను డౌన్లోడ్ చేయవద్దని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తిరుపతి

చెవిరెడ్డి జయమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మేల్యే మధుసూదన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి

శ్రీకాళహస్తి నవంబర్ 28, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎంపీ మద్దెల గురుమూర్తి శ్రీకాళహస్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాతృమూర్తి చెవిరెడ్డి జయమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం అంత్యక్రియలలో పాల్గొని అనంతరం చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,బర్రి సుదర్శన్ రెడ్డి, చంద్ర రెడ్డి, రవీందర్ రెడ్డి,పి చంద్ర రెడ్డి, శేఖర్ రెడ్డి, గంగి రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, శివ రెడ్డి, సుబ్బా రెడ్డి,నాగరాజు రెడ్డి, చెంచయ్యా నాయుడు,సుమన్ రెడ్డి,శ్రీవారి సురేష్,మున్నా రాయల్,బుల్లెట్ జయశ్యామ్ రాయల్, యశ్వంత్ రెడ్డి,మరియు అనేక మంది నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,స్థానికులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై చెవిరెడ్డి జయమ్మకు తుది వీడ్కోలు పలికారు.

తిరుపతి

అన్నదాత ఆనందమే కూటమి ప్రభుత్వ ధ్యేయం-మునిరాజనాయుడు

తొట్టంబేడు, నవంబర్ 28, పున్నమి న్యూస్: తొట్టంబేడు మండలం తంగేళ్ళ పాలెం పిఏసియస్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ తొట్టంబేడు మండల అధ్యక్షుడు రావెళ్ళ మునిరాజా నాయుడు,తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్ సంయుక్తంగా రైతులకు శుక్రవారం నాడు యూరియా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ” పథకం కింద వరుసగా రెండు విడతల్లో కలిసి రూ.6,310 కోట్ల మేర ఆర్థిక సాయం అందించడం రైతాంగానికి పెద్ద ఊరటని హర్షం వ్యక్తం చేశారు. తంగేళ్ళ పాలెం పిఏసియస్ పరిధిలో ఇప్పటి వరకు 144 టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశామని అన్నదాత ఆనందమే కూటమి ప్రభుత్వ ధ్యేయంమని రైతన్నల వ్యవసాయ అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా చేసుకొని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే పెట్టుబడి భారం తగ్గి,రైతు ఆత్మవిశ్వాసం పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ నవశకం చంద్రబాబు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు,అగ్రిటెక్ వినియోగం,ఫుడ్ ప్రాసెసింగ్,ప్రభుత్వ మద్దతు అనే ‘పంచ సూత్రాలు’ ప్రకటించారని తెలిపారు. అన్నదాత సుఖీభవ,సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్,రికార్డు స్థాయిలో ధాన్యం కొనడమే కాకుండా వెంటనే డబ్బు జమచేయడం, రైతుకు నష్టం రాకుండా మామిడి,పొగాకు,కోకో,కాఫీ,మిర్చి, టమాటా,ఉల్లి పంటలకు వందల కోట్ల సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటూ… అన్ని విధాలా రైతుకు అండగా నిలుస్తోన్న చంద్రబాబు ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. రైతు పండించిన పంట ఉత్పత్తులను శుద్ధి చేసి,నిల్వ పెట్టి,విలువను జోడించి, మార్కెట్ కూడా కల్పించే ఆహార శుద్ధి పరిశ్రమలను చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.మొత్తం రూ.21,000 పెట్టుబడులతో ఏర్పాటయ్యే 402 యూనిట్లతో రైతుకు అదనపు ఆదాయం రావడమే కాదు,ప్రాంతీయంగా ఉద్యోగాలు కూడా వస్తాయని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి రైతులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని, కొనుగోలు కేంద్రాన్ని కూడా ఎంచుకుని… ఆ టైమ్ కి అక్కడికి వెళ్లి ఏ సమస్యా లేకుండా ధాన్యం అమ్ముకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ లో 7337359375 నెంబర్ ను ప్రభుత్వం కేటాయించడం జరిగిందిని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు నాయకుడు చిల్లకూరు బాలసుబ్రహ్మణ్యం మణి,చంద్రబాబు,రామచంద్ర, పిఏసియస్ అధికారి చిరంజీవులురెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరులో కొత్త అన్నా క్యాంటీన్ భవనం పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జాయింట్ కలెక్టర్..!

వింజమూరు నవంబర్ 28 పున్నమి ప్రతినిధి వింజమూరు మండల కేంద్రంలో కొత్తగా నిర్మాణం పూర్తిచేసుకున్న అన్నా క్యాంటీన్ భవనాన్ని గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ మొగిలి వెంకటేశ్వర్లు గారితో కలిసి స్వయంగా సందర్శించి, పరిశీలించారు. నిర్మాణ పనులు, వసతులు, ప్రజలకు అందించాల్సిన సేవలపై సమగ్రంగా అవగాహన తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ—గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి నియోజక వర్గములో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని సంకల్పం చేశారు. ఇందులో భాగంగా వింజమూరు ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరలో అందించేందుకు అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోందని తెలిపారు. అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నామని, అత్యంత త్వరలో క్యాంటీన్‌ను ప్రజల సేవకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా పేదల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

అన్నమయ్య

రైతు సంక్షేమమే ధ్యేయం: ‘రైతన్నా మీకోసం’లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్

-బోటుమీదపల్లిలో ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన – అన్నదాత సుఖీభవపై ఆరా తీసిన నాయకులు చిట్వేల్, నవంబర్ 28: పున్నమి ప్రతినిధి కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్నా.. మీ కోసం’కార్యక్రమం రైల్వే కోడూరు నియోజకవర్గంలో చురుగ్గా సాగుతోంది. ఓబులవారిపల్లి మండలం, బోటుమీదపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్వయంగా పాల్గొని రైతులకు భరోసా ఇచ్చారు. -ఇంటింటికీ వెళ్లి పథకాల పంపిణీ కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ముక్కా రూపానంద రెడ్డి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి రైతులతో మమేకమయ్యారు. వారు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై రూపొందించిన పాంప్లెట్లను పంపిణీ చేసి, పథకాల గురించి వివరంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలబడతాం,” అని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే, ఇటీవల విడుదలైన ‘అన్నదాత సుఖీభవ’ పథకం డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాయా లేదా అని రైతులను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. -రైతుల శ్రేయస్సే లక్ష్యం అనంతరం ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. రైతులకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆమె కోరారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతులు తమ సమస్యలను నేరుగా నాయకులకు వివరించి, పథకాల గురించి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది.

E-పేపర్

తెలంగాణ పంచాయతీ ఎన్నికలను రద్దు చేసి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని బీసీ కమిషన్ డిమాండ్

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 తెలంగాణ పంచాయతీ ఎన్నికలను రద్దు చేసి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని బీసీ కమిషన్ డిమాండ్ 2019 పంచాయితి ఎన్నికల్లో బీసీలకు 22.78% రిజర్వేషన్లు లభించాయి.. ఇప్పుడు దీనికంటే తక్కువ రిజర్వేషన్లు బీసీలకు కల్పించారు బీసీల సంఖ్య జనాభాలో 56.33% అని కులగణన సర్వేలో తేలిన తర్వాత కూడా.. 2019 ఎన్నికల కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది రిజర్వేషన్లను నిర్ధారించే ప్రక్రియలో జరిగిన పొరపాటు వల్లనే బీసీ రిజర్వేషన్లు గతంలో కంటే తక్కువ అయ్యాయి పంచాయతీ ఎన్నికలను నిలిపివేసి, ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, రిజర్వేషన్లలో జరిగిన తప్పులను సవరించాలి అప్పుడు ఎన్నికలకు వెళ్లాలి.. లేకుంటే బీసీలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది – బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

E-పేపర్

కొవ్వూరు డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయిచాలని డిమాండ్

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి కొవ్వూరు కొవ్వూరు డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించి ఇచ్చిన స్థలంలో నిర్మాణం తక్షణమే చేపట్టాలని ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ లో ఏ.ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు వై.భాస్కర్, ఎస్.రాజు మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీగ ఆర్ డి ఓ ఆఫీస్ కు వెళ్లి వినతిపత్రం అందజేశారని అన్నారు 2019లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారన్నారు చుట్టుపక్కల 30 కిలోమీటర్లలొని గ్రామాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా డిగ్రీ కళాశాల నడుస్తుంది అన్నారు. ఇక్కడే ఇంటర్, స్కూల్ ఉండటంతో ఒక పూట మాత్రమే కళాశాల జరుగుతోందన్నా అన్నారు. తరగతి గదులు లేక విద్యార్థులకు ఇబ్బంది అవుతోందని అయితే ఈ డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం 2021లో 4.8 స్థలం కేటాయించారు. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి నిధులు కేటాయించలేదని దీంతో కళాశాల నిర్మాణం జరగట్లేదు అని తక్షణమే డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించి ఇచ్చిన స్థలంలో నిర్మాణం చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో కార్తీక్, లోహిత్, మహేష్ విద్యార్థులు పాల్గొన్నారు END

అన్నమయ్య

ప్రజా సమస్యలకు వేదిక ‘జనవాణి’

-చిట్వేల్‌లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అధ్యక్షతన తొలి కార్యక్రమం – సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ప్రభుత్వ విప్ చిట్వేల్, నవంబర్ 28: పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించే లక్ష్యంతో చేపట్టిన ‘జనవాణి’ కార్యక్రమం చిట్వేల్ పట్టణంలో నేడు (శుక్రవారం) ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. -సమస్యల సుడిగుండం చిట్వేల్ పట్టణ ఆవరణలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక సమస్యలైన తాగునీరు, రోడ్లు, వెలుతురు, అలాగే పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణం వంటి వ్యక్తిగత సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకు నేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రజల అర్జీలను ఓపికగా స్వీకరించి, అందులో కొన్ని తక్షణ పరిష్కారం అవసరమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -ఐదేళ్ల వైఫల్యంపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలో కనీస వసతులను కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సాధారణ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వారికి నేరుగా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే ఈ ‘జనవాణి’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. “సామాన్య ప్రజల సమస్యల పరిష్కారమే ఈ జనవాణి లక్ష్యం. ప్రభుత్వం వద్ద జాప్యం లేకుండా, వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాం,” అని ఆయన హామీ ఇచ్చారు. అలాగే, రానున్న రోజుల్లో రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింత నిబద్ధతతో కృషి చేస్తామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.ప్రతి నెలా నియమితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో తాతంశెట్టి నాగేంద్ర, ఇతర ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో ఏపీ హంస జిల్లా కార్యవర్గ సమావేశం – కో–ఆప్షన్ ఎన్నికల ద్వారా కొత్త బాధ్యుల ఎంపిక

28.11.2025 నెల్లూరు యుటిఎఫ్ ఆఫీస్, అన్నమయ్య సర్కిల్ నందు ఏపీ హంస జిల్లా కార్యవర్గ సమావేశం సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి తాలూకా వింజమూరు తాలూకా కావలి తాలూకా బుచ్చిరెడ్డిపాలెం తాలూకా కార్యవర్గాల్లో ఏర్పడిన ఖాళీల్లో కో ఆప్షన్ ద్వారా ఏకగ్రీవ ఎన్నిక నిర్వహించడం జరిగింది, ఈ ఎలక్షన్ ప్రొసీజర్ ను జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కప్పా నారాయణరాజు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ జలీల్ అహ్మద్ , జిల్లా పబ్లిసిటీ సెక్రటరీ మజార్, సిటీ అధ్యక్షులు గౌస్ బాషా సిటీ సెక్రెటరీ మంజరి, రూరల్ తాలూకా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి సిటీ సెక్రెటరీ సుజాత, కోవూరు తాలూకా అధ్యక్షులు ఉమా ఎలక్షన్ ఆఫీసర్స్ గా వ్యవహరించి నిర్వహించారు. ఉదయగిరి తాలూకా ప్రెసిడెంట్ షేక్ గాజుల నౌషాద్ బాబు, తాలూకా సెక్రెటరీ షేక్ కాజా మొహిద్దిన్, మహిళా వింగ్ సెక్రెటరీ ఎం చంద్రావతి, వైస్ ప్రెసిడెంట్స్ షేక్ రబ్బానీ భాషా ఎం లావణ్య జాయింట్ సెక్రటరీలు జై శైలజ కె జయమ్మ, అదేవిధంగా వింజమూరు తాలూకా వైస్ ప్రెసిడెంట్స్ గా వి. ఝాన్సీ రాణి డి. శ్రీవిద్య మహిళా వింగ్ సెక్రెటరీ ఎం సుహాసిని జాయింట్ సెక్రటరీలు డి కృష్ణవేణి, పి. రమణమ్మ, మంజులవాణి బుచ్చిరెడ్డిపాలెం తాలూకా ఆరోగ్యమేరి ట్రెజరర్, సుకన్య వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రెటరీలు వాణి, అరుణ కావలి తాలూకా షేక్ నూర్ భాషా ట్రెజరర్, ఎస్ భార్గవి వైస్ ప్రెసిడెంట్ , పి.శాంత కుమారి జాయింట్ సెక్రెటరీ తదితరులును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంను ఉద్దేశించి ఎపి హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు మాట్లాడుతూ వైద్య మరియు ఆరోగ్య శాఖలో తొలగించబడిన హెల్త్ అసిస్టెంట్స్ లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు తీర్పు ఇచ్చిన సందర్భంగా త్వరితగతిన వారిని విధుల్లో కి తీసుకోవాలని, తొలగించిన టైంలో మృతి చెందిన హెల్త్ అసిస్టెంట్ల కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏఎన్ఎంలకు పెంచిన యాప్లు తగ్గించాలని, 25 సంవత్సరాలు పైబడి సర్వీస్ చేసిన ఏఎన్ఎం లకు పదోన్నతులు లేని పరిస్థితి ఉందని, కొంతమంది పదోన్నతి లేకుండానే రిటైర్మెంట్ అవ్వడం జరుగుతుందని, పదోన్నతుల్లో జాప్యం జరగకుండా ఉన్నతాధికారుల చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుచ్చి తాలూకా ప్రెసిడెంట్ సరస్వతి కావలి తాలూకా సెక్రెటరీ లక్ష్మి నరసయ్య పలు తాలూకాలు నాయకులు అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు

వనపర్తి

ఘనంగా జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్ గారు

*వనపర్తి జిల్లా జిల్లాస్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన* *ఘనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్* పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 28 11 2025 2025-2026 వనపర్తి జిల్లా చిట్యాల గురుకుల పాఠశాలలో గౌరవ కలెక్టర్ ఆదర్శ్ సురభి గారి అధ్యక్షతన , గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని సార్ గారి ఆధ్వర్యంలో, డీఎస్ఓ శ్రీనివాసులు సార్ పర్యవేక్షణలో చిట్యాల గురుకుల పాఠశాలలో ఈరోజు జిల్లాస్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన నవంబర్ 28, 29, 30 మూడు రోజులు జిల్లా స్థాయిలోన నేడు జరుగుతున్నది,జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారి శాస్త్ర విజ్ఞాన ప్రయోగాలను చిట్యాల గురుకుల పాఠశాలలోన ప్రదర్శించడం జరుగుతుంది, ఈ సందర్భంగా వనపర్తి జిల్లా గౌరవ కలెక్టర్ ఆదర్శ్ సురభి గారు మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞాన ప్రయోగాలు విద్యార్థులలో సృజనాత్మకతకు నిదర్శనం అన్నారు, శాస్త్ర విజ్ఞానపు ప్రయోగాలు సత్యం అన్నారు, ఈ కార్యక్రమంలో సూపర్ విజన్ కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీ, స్టేజ్ కమిటీ, కల్చరల్ కమిటీ, ఫుడ్ కమిటీ, ప్రెస్ కమిటీ చైర్మన్లు గా గజిటెడ్ ప్రధానోపాధ్యాయులను నియమించడం జరిగింది, ఈరోజు జిల్లాస్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వనపర్తి ఎమ్మార్వో రమేష్ రెడ్డి గారు, జిల్లా అన్ని ఉపాధ్యాయ సంఘాలు, పత్రికా విలేఖరులు పాల్గొనడం జరిగింది. ప్రెస్ కమిటీ,ఎం ఎన్ విజయకుమార్, బి.గిరిరాజాచారి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.