Tuesday, 17 March 2026

Blog

రంగారెడ్డి

* రామకృష్ణాపురం డివిజన్ సమస్యలపై దేప భాస్కర్ రెడ్డిని కలిసిన కాలనీ పెద్దలు*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 30 : మహేశ్వరం నియోజకవర్గంలోని రామకృష్ణాపురం డివిజన్‌ పరిధిలోని పలు కాలనీల సమస్యల పరిష్కారం కోసం ఆయా కాలనీల పెద్దలు, సంక్షేమ సంఘాల నాయకులు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు కాలనీల సమస్యలపై చర్చించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు పున్న గణేష్ నేత ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్, సుధాకర్ శర్మ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, జగన్నాథం డైరెక్టర్ సందీప్ మరియు ఆయా కాలనీలకు చెందిన పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జాతీయ అథ్లెటిక్స్ సాంకేతిక నిపుణిలుగా మనోజ్ కుమార్ ఎంపిక

కేలో ఇండియా యూనివర్సిటీ జాతీయ క్రీడలకు సాంకేతిక నిపుణులుగా శ్రీ గంగిశెట్టి మనోజ్ కుమార్. డిసెంబర్ 1 నుండి 5వ తారీఖు వరకు జైపూర్ రాజస్థానీ రాష్ట్రంలో జరిగే కే లో ఇండియా యూనివర్సిటీ జాతీయస్థాయి క్రీడా పోటీలకు శ్రీ గంగిశెట్టి మనోజ్ కుమార్ సాంకేతిక నిపుణులుగా ఎంపికయ్యారు గతంలో కూడా శ్రీ గంగిశెట్టి మనోజ్ కుమార్ ఎన్నో జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సాంకేతిక నిపుణులుగా వ్యవహరించారు. ఎంపిక పట్ల జనగామ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పెద్ది వెంకటనారాయణ గౌడ్ పాఠశాల క్రీడా కార్యదర్శి మరియు తెలంగాణ జనగామ జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు శ్రీ గౌర్ సింగ్, జనగామ జిల్లా అసోసియేషన్ సభ్యులు అశోక్ కుమార్ చంద్రశేఖర్ రెడ్డి రంజిత్ సురేష్ తదితరులు అభినందనలు తెలియజేశారు. తన ఎంపిక పట్ల మనోజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ స్టాండ్లీ జోన్స్ మరియు సారంగపాణి కృతజ్ఞతలు తెలియజేశారు

జనగాం

జనగామ జిల్లా దివ్యాంగ ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ సంఘం ఏర్పాటు

దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం: జనగామ, నవంబర్29,పున్నమి న్యూస్: దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం జనగామ జిల్లాశాఖ మొట్టమొదటి సమావేశం సీనియర్ ఉపాధ్యాయుడు అంబటి అంజయ్య గారి అధ్యక్షతన ప్రాధమిక పాఠశాల జనగామ రైల్వే స్టేషన్ (పండ్లబడి) ఆవరలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి హన్మకొండ, వరంగల్ జిల్లాల ఉమ్మడి అధ్యక్షులు బిల్లమహేందర్ గారు, రాష్ట్రకమిట్ సభులు శ్రీమతి నర్సమ్మగారు పాల్గున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులమైన మనము ఆత్మస్థైరము, గుండె నిబ్బరము, అంకెత భావము, ఆత్మగౌరవము తో పనిచేసి సకలాంగులకంటే మనము దేనిలో తక్కువ కాదని, అన్నిరంగాలను ముందుంటే విదంగా పనిచేయాలని కోరారు. మనము చేసే పనిలో నైపుణము తో పనిచేసి అద్భుతమైన పలితాలకోసం కృషి చేయాలని, కోరారు. ఆతరువాత జనగామ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమసంఘం జనగామ జిల్లా శాఖ గౌరవ సలహాదారులు :- శ్రీ అంబటి అంజయ్య గారు . అధ్యక్షులు:- సయ్యద్ మునవర్ పాషా గారు . కారు నిర్వహక అధ్యక్షులు–అనుముల కుమార్ గారు ( ప్రధాన కార్యదర్శి – శ్రీ కొలిపాక యాదగిరి గారు కోశాదికారి :- K – సుదాకర్ గారు. (ప్రచార కార్యదర్శులు :- 1, బృంగి కార్తీక్, బిట్ల వేణుకుమార్ ఉపాధ్యక్షులు, -1, కృష్ణవేణి , విజయపాల్ రెడ్డి , యాదగిరి కార్యదర్శులు :- 1, నర్సింహులు, శ్రీనివాస్, రాధిక, సరిత. కార్యవర్గసభ్యులు:– కుమారస్వామి, శ్రీధర్, ఉపేందర్, కనకరాజ్- ఎన్నికల పరిశీలకులుగా బిల్లమహేంధర్, నరసింహ గార్లు వ్యవహరించారు –

అనకాపల్లి

ఎలమంచిలి ఎంపీపీ గా గౌ శ్రీ రాజన్న సూర్యచంద్ర శేషగిరిరావు ( శేషు) ప్రమాణ స్వీకారం..!

అనకాపల్లి జిల్లా నవంబర్ 30 పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్ ): యలమంచిలి నియోజకవర్గo ఎమ్మెల్యే సుందర్ విజయకుమార్ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ రాజన్న సూర్యచంద్ర శేషగిరిరావు ( శేషు) ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూటమి నాయకులు, జన సైనికులు నియోజవర్గ పెద్దలు పాల్గొంటున్నారు. వేదిక ఎలమంచిలి మండల ప్రజా పరిషత్.

కామారెడ్డి

ఘనంగా బండమిది మల్లన్న బోనాలు

కామారెడ్డి, 30 నవంబర్,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో బండమిది సట్టి తీర్థం ప్రతివసంతం జరుగుతున్న మల్లన్న బోనాలు ఈ సారి అత్యంత పవిత్రంగా, హర్షోత్సాహంతో నిర్వహించబడ్డాయి. బండి వంశస్థులు మాట్లాడుతూ,మల్లన్న తండ్రీని ఉద్దేశిం చి మొక్కులు చెల్లించడం, పల్లెటూరి సంప్రదాయా లను కాపాడుతూ ఆధ్యాత్మికతను రెట్టింపు చేశా రు.ఈ ఉత్సవం ద్వారా గ్రామ సాంప్రదాయాలు పటి ష్టం కావడమే కాకుండా, ఆత్మీయత, సామాజి క ఐక్యత మరింత బలం పొందింది.ప్రతి సంవత్స రం జరిగే ఈ బోనాలు మల్లన్న భక్తుల గుర్తింపుకు, పల్లె సంస్కృతి పరిరక్షణకు అతి ముఖ్యంగా నిలుస్తున్నాయని చెప్పారు.ప్రధానంగా బండి కుటుంబ వంశస్థులు సాట్టీ తీర్థం కార్యక్రమాన్ని నిర్వహించి, ఈ పుణ్య కృషికి ప్రత్యేక గౌరవాన్ని చేకూర్చారు.ఈ కార్యక్రమంలో బండి అంజయ్య, బండిబాలరాజ్, లింబాద్రి, బండి బుచ్చయ్య,స త్యం,బండి సంతోష్, బండి భూమయ్య, బండి ప్రవీణ్, బండి భాస్కర్, బండి రాజశేఖర్, వంశస్థు లు,గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నా రు.

కామారెడ్డి

స్క్రూటినీ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.

రామారెడ్డి, 30 నవంబర్, పున్నమి ప్రతినిధి రామారెడ్డి మండల పరిధిలో గల గ్రామ పంచాయ తీల సర్పంచ్, వార్డ్ సభ్యుల నామినేషన్ పత్రాల పరిశీలన (స్క్రూటినీ) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సంబంధిత రిటర్నింగ్ అధికారి ఆధ్వ ర్యంలో ఉదయం ప్రారంభమైన స్క్రూటినీలో దాఖలైన మొత్తం నామినేషన్లను ఒక్కొక్కటిగా పరిశీలించి అర్హత నిర్ణయించారు.అధికారిక సమాచారం ప్రకారం, మండల వ్యాప్తంగా సర్పంచ్ పదవికి దాఖలైన నామినేషన్లలో ఎక్కువ శాతం సరైన పత్రాలు, రుజువులతో ఉండటం వల్ల అవి చెల్లుబాటు అయ్యాయి.కొద్దిపాటి లోపాలున్న పత్రాలను మాత్రమే తిరస్కరించారు. తిరస్కరణ కు గురైన అభ్యర్థులకు కారణాలు లిఖిత పూర్వకం గా అందజేయగా, సవరించిన అభ్యంతరాలు స్వీకరించే గడువు గురించి కూడా సూచనలు ఇచ్చినట్లు మండల రెవెన్యూ అధికార వర్గాలు తెలిపాయి.వార్డ్ సభ్యుల స్థానాలకు ఇదే వేళ స్క్రూటినీ పూర్తి చేయగా, ఎక్కువ గ్రామాల్లో పోటీ మలుపుతిప్పే అభ్యర్థుల తుద జాబితా బుధవా రం ప్రచురించనున్నారు. అర్హత పొందిన అభ్యర్థుల తుది జాబితా విడుదలైన వెంటనే గుర్తు కేటాయిం పు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాల ప్రదర్శన వంటి తదుపరి ఎన్నికల కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.ఎన్నికల ప్రక్రియ పారదర్శ కంగా, ఎలాంటి ఆందోళనలూ లేకుండా సాగడానికి అన్ని గ్రామాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు, వెబ్‌కాస్టింగ్ వంటి చర్యలు చేపట్టనున్నట్లు అధికా రులు పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యా న్ని బలోపేతం చేయడానికి ప్రతి ఓటరు తప్పనిస రిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు. మండలంలో 18 గ్రామాలకు 103 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు వచ్చినవని, 18 గ్రామాల వార్డులు 166 పోలీస్ పోలింగ్ కేంద్రాలకు 422 వాడు నామినేషన్ తుది జాబితా పత్రాలు సరిచేశామని తెలిపారు.

Blog

గురివిరెడ్డి ఫ్యామిలీ వారిచే అయ్యప్ప స్వామి భక్తులకు 15 రోజులు సాయంత్రం పూట బిక్ష

గురివిరెడ్డి ఫ్యామిలీ వారిచే అయ్యప్ప స్వామి భక్తులకు 15 రోజులు సాయంత్రం పూట బిక్ష రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు మండలం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 15 రోజుల నుండి ఈరోజు వరకు గురివిరెడ్డి ఫ్యామిలీ వారిచే మన అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతీ రోజూ సాయంత్రం అయ్యప్పభక్తులకు మరియు విచ్చేసిన భక్తులకు భిక్ష(200 నుండి 250 మందికి) ఏర్పాటు చేసి చివరిగా పడి పూజ ఏర్పాటు చేసి (సుమారు రెండు లక్షల రూపాయలు వరకు సొంత నిధులతో) దిగ్విజయంగా జరిపించినందులకు గానూ శ్రీ చీతిరాల రామానుజం రంగనాయకమ్మ ట్రస్ట్ కార్య నిర్వహణ అద్యక్షులు మోపూరు వెంకటసుబ్బయ్య మరియు కార్యదర్శులు గణేష్,సత్యనారాయణకు చిరు సత్కారం చేయడం జరిగింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

దక్షిణాఫ్రికా టార్గెట్ 350

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి వన్డేలో భారత్ బ్యాటింగ్ ముగిసింది. కోహ్లి(135) శతకంతో అదరగొట్టాడు. రోహిత్(57), కెప్టెన్ రాహుల్(60) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లకు భారత్ 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. జైస్వాల్ 18, రుతురాజ్ 8, సుందర్ 13, జడేజా 32, హర్షిత్ రాణా 3 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో బర్గర్, బార్ట్మన్, యాన్సన్, బాష్ రెండేసి వికెట్లు తీశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవం

30/11/2025*గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి* *దాతలతో పాటు పారిశ్రామికవేత్తల సహకారంతో గిరిజనకాలనీల్లో అభివృద్ధి పనులు* *ప్రతి పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటే లక్ష్యం* *మనుబోలు పడమర వీధి ఎస్టీ కాలనీతో పాటు అక్కంపేటలో మెట్టు రవీంద్రరెడ్డి ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* గిరిజనులు, పేదలకు ఉపయోగపడే పనులు చేయడం చెన్నూరుకు చెందిన మెట్టు రవీంద్రరెడ్డికి ఎంతో ఇష్టం అందులో భాగంగా పేదలకు ఉపయోగపడేలా ఆర్వో ప్లాంట్లు అందుబాటులోకి తెస్తున్నారు ఇవే గాక రవీంద్రరెడ్డి ఆద్వర్యంలో మరో మూడు ప్లాంట్లు సిద్దమవుతున్నాయి SEIL కంపెనీ కూడా ఒక్కొక్కదానికి రూ.36 లక్షలు వెచ్చించి 14 ప్లాంట్లు ఏర్పాటు చేసింది రూ.7 లక్షల చొప్పున ఖర్చు చేస్తూ మరో 33 ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది ప్రతి పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం గిరిజనుల అభ్యున్నతిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాం ఇప్పటి వరకు 3 వేల మంది గిరిజనులకు ఆధార్ కార్డులు ఇప్పించాం 12 గిరిజన కాలనీలను పామాయిల్ కంపెనీలు దత్తత తీసుకున్నాయి మిగిలిన కాలనీలను కూడా పారిశ్రామికవేత్తలకు దత్తత ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం టీపీ గూడూరు మండలం మల్లికార్జునపురంలోని 280 కుటుంబాలను SEIL కంపెనీ దత్తత తీసుకుంది ఆ గ్రామంలో ఈ ఏడాది రూ.3 కోట్లు ఖర్చుపెట్టడంతో పాటు వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.1.30 కోట్లు ఖర్చుపెడతామని SEIL ప్రకటించింది జెమినీ కంపెనీ బ్రహ్మదేవం గిరిజన కాలనీలో రూ.93 లక్షలతో పనులు ప్రారంభించింది ప్రతి గిరిజన కాలనీలోనూ ఆయా కంపెనీలు యాక్షన్ ప్లాన్ చేపట్టాయి వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏనాడు పేదల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు సమాజంలో అత్యంత అమాయకులైన గిరిజనుల అభ్యున్నతిని పూర్తిగా విస్మరించారు వేలాది మందికి కనీసం ఆధార్ కార్డు ఇప్పించలేకపోయారు..సచివాలయాలు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి గిరిజనుల కోసం నిర్మించిన ఇళ్లు కూడా అక్రమాలకు నిలయంగా మారాయి..అత్యంత నాసిరకంగా కట్టారు సర్వేపల్లిలో గిరిజనులకు చెందిన 6 ఎకరాలను కంపెనీలకు అమ్మేసుకున్నారు వావిలేటిపాడులో దళితుల భూములను చెరపెట్టారు ప్రజల కష్టాలను తొలగించకపోగా కొత్తకొత్త సమస్యలు సృష్టించి దోపీడీకి పాల్పడ్డారు కూటమి ప్రభుత్వం పాలనలో పేదలకు ఎంత వరకు సాయం చేయగలమో అంతవరకు శాయశక్తులా చేస్తాం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అక్కంపేటలో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవం

30/11/2025*మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో దాతల సాయంతో ఏర్పాటుచేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ఆదివారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. స్వచ్ఛమైన నీటిని అందించాలని ఉద్దేశంతో దాతలు మెట్టు రవీందర్ రెడ్డి మెట్టు సాయి రెడ్డి కుటుంబీకులు వ్యవహరించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు AmC చైర్మన్ రామకృష్ణారెడ్డి మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య నీటి సంఘం అధ్యక్షులు ఏకొల్లు కోదండరామిరెడ్డి మైనార్టీ నాయకులు అమీర్ భాష బూత్ అధ్యక్షులు ఇనమడుగు వేణుగోపాల్ రెడ్డి షేక్ ఫయాజ్ పూండ్ల దశరధి రామిరెడ్డి పూండ్ల రామ్మోహన్ రెడ్డి మధు యాదవ్ వెడిచర్ల వెంకటరమణారెడ్డి కిరణ్ భాస్కర్ రెడ్డి దండు చంద్రశేఖర్ రెడ్డి జనసేన నాయకులు సురేష్ నాయుడు పెనుబాక ప్రసాద్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.