Tuesday, 17 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

వలస కూలీలకు దుప్పట్లు పంపిణీ చేసిన ఆత్మీయత సేవా సొసైటి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హనుమాన్ టెంపుల్ పక్కన గుడిసెలలో నివసించే వలస కూలీలకు ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో దుప్పట్లు, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన దాతలకు సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బయ్యన మహేందర్, మాటూరి క్రాంతికుమార్, పఠాన్ షాకీర్, బండి శ్రీనివాస్, సెగ్గెం దేవేందర్, రూప్ సింగ్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సీనియర్ నటుడు నరేష్‌కు నరసరావుపేటలో ఘన సన్మానం

నరసరావుపేటలో H6 హోటల్‌లో నిర్వహించిన న్యూ మాంగ్స్ కుంగ్ ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నటుడు నరేష్‌ను, టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ–మహేశ్ బాబు యువశక్తి అధ్యక్షుడు MD. ఫారూఖ్ బాబు సన్మానించారు. ఈ సందర్భంగా తన తల్లి స్వర్గీయ విజయనిర్మల విగ్రహ ఏర్పాటుపై నరేష్ స్పందించారు. పలువురు కృష్ణ సీనియర్ అభిమానులు సమావేశంలో పాల్గొన్నారు.

కాకినాడ

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో మానవహారం

పున్నమి న్యూస్, పెద్దపురం, 01, డిసెంబర్. పెద్దాపురంలోని వైస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా HIV అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా స్థానిక పెద్దాపురం ఆర్టీవో శ్రీమతి కే రమణి పాల్గొన్నారు, ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పెద్దాపురం మరియు కాకినాడ జిల్లా ఏయిడ్స్ రహిత ప్రాంతాలుగా ఉండాలని వివరించడం జరిగింది. తర్వాత స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ హెచ్ఐవి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరు హెచ్ఐవి పరీక్ష చేయించుకుని వారి యొక్క స్థితిని తెలుసుకోవాలన్నారు, ఏయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపరాదని చెప్పడం జరిగింది. అనంతరం RDO గారు జండా ను ఊపి ర్యాలీ ణి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆర్డీవో ఆఫీసు నుండి స్థానిక మున్సిపల్ సెంటర్ వరకు కొనసాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడి ప్రతి ఒక్కరుతో హెచ్ఐవి పట్ల అవగాహన కలిగేలా స్థానిక ఎస్సై మౌనిక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఐ సి టి సి కౌన్సిలర్ దిలీప్ శ్రీనివాస్, ఆశా వర్కర్లు, స్థానిక సిబ్బంది, మానహ హక్కుల సంఘం ప్రెసిడెంట్ N అప్పలకొండ వారి సిబ్బంది వైస్ సంస్థ ప్రెసిడెంట్ బి మల్లేశ్వరి, PD R జయ, PM M లక్ష్మణచార్యులు, V జార్జ్, లూధరన్ హై స్కూల్ విద్యార్థులు, సిబ్బంది, సాగర్ కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ

‘మేక్ అమెజాన్ పే’—30 దేశాల్లో కార్మికుల ఉధృతి

అమెజాన్ కార్మికులు ‘మేక్ అమెజాన్ పే’ పిలుపుతో 30 దేశాల్లో ఆందోళనలు ప్రారంభించారు. భారత్‌లో 20 నగరాల్లో గిగ్ వర్కర్లు, గిడ్డంగి సిబ్బంది రోడ్లెక్కగా, జర్మనీలో మూడు వేల మంది సమ్మె చేశారు. అమెరికా, స్పెయిన్‌తో పాటు డెన్మార్క్, గ్రీస్, యుకే మరియు ఇతర దేశాల్లో నిరసనలు జరిగాయి. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

జోగులాంబ గద్వాల

డాక్టర్ బైరి నరేష్ గారి అక్రమ అరెస్ట్ ని ఖండిస్తున్నా MNS జోగులాంబ గద్వాల్ జిల్లా నాయకులు..

గద్వాల్ డిసెంబర్ 1 (పున్నమి ప్రతినిధి) *డాక్టర్ బైరి నరేష్ గారి అక్రమ అరెస్ట్ ని ఖండిస్తున్నా MNS జోగులాంబ గద్వాల్ జిల్లా నాయకులు.* మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ బైరి నరేష్ గారు గత 30 సంవత్సరాలుగా మూఢనమ్మకాల నిర్మూలన కోసం పాటు పడుతున్న మన కాలపు సంఘ సంస్కర్త. ఆయన గత మూడు సంవత్సరాల క్రితం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అయ్యప్ప జననం గూర్చి మాట్లాడిన మాటలను పదిహేను రోజుల తర్వాత బిజేపి మూకలు కుట్ర చేసి అయ్యప్ప మాల దారులను రెచ్చగొట్టి వివాదాస్పదం చేసిన విషయం మీకు తెలిసిందే. స్టేషన్ బేయిల్ ఇవ్వ వలసిన కేసులో డా బైరి నరేష్ ని అరెస్ట్ చేసి 46 రోజుల పాటు జైలు పాలు చేసారు. అనంతరం బైరి నరేష్ గారు సోషల్ మీడియా ద్వారా తన ఆలోచనలను బలంగా వినిపించారు. అది జీర్ణించు కోని బిజేపి మరియు దాని అనుబంధ సంఘాలు పోలీసు వాహనంలో ప్రయాణిస్తున్న బైరి నరేష్ పై  భౌతికంగా దాడి చేసారు. ఇది జరిగి మూడు సంవత్సరాలు అవుతుంది. ఆయన నాస్తిక సంఘం వీడి తాను తన భార్య సుజాత టీచర్ కలిసి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం స్థాపించారు. నిరంతరం అనేక గ్రామాలు పల్లెలు తిరుగుతూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఆరు రాష్ట్రాల్లో సంఘాన్ని విస్తరించారు.  తమ లాంటి వారిని వేలాది మందిని సమీకరిస్తూ, సమాజ చైతన్యంలో ఎనలేని కృషి చేస్తున్నారు. ఆయన తనను తాను మలుచుకొని, మెరుగు పరుచుకొని, కేవలం మూఢనమ్మకాల పై దృష్టి పెట్టారు. అన్ని మతాల వారితో కలిసిమెలిసి నడుస్తూ మూఢనమ్మకాల నష్టాలను వివరిస్తున్నారు. ప్రస్తుతం డా. బైరి నరేష్ గారికి రెండు లక్షల పాతిక వేల మంది అనుచరులు ఉన్నారు. దాదాపు 100 జిల్లాలో MNS సంఘం కమిటీలు ఉన్నాయి. ఒక పరిశోధకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, విద్యా వంతుడు ఉన్నత చదువులు అనేకం చదివిన ఆయన మూఢనమ్మకాల పై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు… అటువంటి ఆయన నవంబర్ 30 ఆదివారం రోజు గద్వాలలో ఒక పెళ్ళి కార్యక్రమానికి అతిథిగా హాజరవడం కోసం శనివారం రాత్రి గద్వాల్ టౌన్ వచ్చారు. తన స్నేహితుడి ఇంట్లో సంతోషం గుడిపారు. ఆదివారం రోజున తాను ఒక పెళ్ళిలో పాల్గొన వలసి ఉంది. తనను కలవడానికి జిల్లా నలుమూలల  నుండి పలవురు అభిమానులు కార్యకర్తలు గద్వాల్ చేసుకుంటుండగా, ఉదయం 6:00 గంటల సమయంలో గద్వాల్ పోలీసులు డా. బైరి నరేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసారు. తనపై వచ్చిన ఫిర్యాదు ఏమిటి అని, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడికి తీసుకు పోతారు అని అడిగితే పోలీసులు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆయనపై దురుసుగా ప్రవర్తించారు. బైరి నరేష్ చట్టాన్ని గౌరవిస్తూ తన సొంత వాహనంలో పోలీస్ స్టేషన్ వస్తాను అని చెప్పిన పోలీసులు ఏమాత్రం వినకుండా, ఒక నేరస్తుడిలాగా, ఉగ్రవాది ట్రీట్ చేసారు. పెళ్ళి చోటికి వెళ్ళి ఎటువంటి ప్రసంగం చేయనని నూతన జంటకు అంబేద్కర్ ఫోటో ఇచ్చి మీతో వస్తాను అని చెప్పిన వినకుండి బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు. వాహనం ఎక్కిన గంట వరకు డా. బైరి నరేష్ వద్ద ఫోన్ ఉంది. తన చేతిలో ఉన్న ఫోన్ ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసి నరేష్ గారు పోస్ట్ చేసారు. అనంతరం రెండు గంటల తర్వాత తన యూట్యూబ్ ఛానల్ లో లైవ్ పెట్టి తనను ఎందుకు అరెస్ట్ చేసారు, ఎక్కడికి తీసుకుపోతున్నారో తన అడ్వకేట్ కి మరియు తన కుటుంబానికి తెలపండి అని గట్టిగా పోలీసులను నిలదీసారు. , పదిమంది పోలీసుల వచ్చి తన స్నేహితుడి ఇంటి నుండి అక్రమంగా ఆయన్ని అదుపులోకి తీసుకుని ఎటు  తీసుకు పోతున్నారో తెలుసుకోవడం చాలా దుర్మార్గం. ఒక సామాజిక ఉద్యమకారుడు, లక్షలాది మంది అనుచరులు ఉన్న ఒక నాయకుడిని అరెస్ట్ చేసి కారణం చెప్పకుండా ఉండటం చాలా దారుణం. పోలీసుల ని గంటల తరబడి వాహనంలో తిప్పుతున్నారు, తన ఫోన్ స్పిచ్ ఆఫ్ అయ్యింది.  ఆయనను పోలీసులు ఏమి చేస్తారో అనే ఆందోళనలో అందరూ ఉన్నారు. పోలీసు అధికారులు వెంటనే ఆయన్ను విడుదల చేయాలి. ఎందుకు అరెస్ట్ చేసారో పౌర సమాజానికి వివరణ ఇవ్వాలి. లేదంటే సమాజ మార్పు కోరే ప్రతి వ్యక్తి రోడ్ పైకి వస్తారని తెలుపుతున్నాము. చట్టాన్ని ఉల్లంఘించే ఆకతాయిలను, చట్టాన్ని గౌరవించని వారి కోసం ప్రజలను చైతన్య పరిచే వారి పట్ల పోలీసుల ప్రవర్తన బాధాకరం. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన వీడియో కు అనేక ప్రజా సంఘాలు వేగంగా స్పందిచాయ్ ఆయన్ని వెంటనే విడుదల చేయాలని ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాల వారు, సామాజిక ఉద్యమకారులు పిలుపునిచారు. అన్ని జిల్లాలలో డా. బైరి నరేష్ అక్రమ అరెస్ట్ నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తామని MNS సభ్యులు హెచ్చరించారు

వనపర్తి

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని గారి పిలుపు

*సైన్స్ ఫెయిర్ తో శాస్త్రీయ దృక్పథం విద్యార్థుల్లో పెంపొందించవచ్చు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని గారి పిలుపు* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 01/12 /2025/* *వికసితి భారత్ శాస్త్రీయ దృక్పథం డిజిటల్ విద్య పర్యావరణహితం ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టడం ఆలోచన పరిశీలన శక్తిని విద్యార్థుల్లో పెంపొందించడం లాంటి ప్రధాన అంశాలతో మూడు రోజులుగా ఎం జె పి చిట్యాల లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ఘనంగా ముగింపు చేయడం జరిగిందని ఇందులో ప్రథమ ద్వితీయ ఎగ్జిబిట్స్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులు వచ్చేనెల రాష్ట్రస్థాయిలో జరిగే సైన్స్ ఫెయిర్ లో పాల్గొంటారని జిల్లా కి మంచి పేరు తీసుకొస్తారని ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలని జిల్లాలోని అన్ని పాఠశాలలో సైన్సు పరికరాలను డిజిటల్ విద్యతో మమేకం చేస్తూ వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందే విధంగా బోధన అభ్యసన జరగాలని ఉపాధ్యాయులను ఉద్దేశించి డీఈఓ గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శ్రీనివాసులు ఏఎమ్ఓ మహానంది ప్రతాప్ రెడ్డి ఉపాధ్యాయ సంఘం నాయకులు మీడియా కన్వీనర్లు ఎం ఎన్ ఎిజయకుమార్ గిరిరాజా చారి తదితరులు పాల్గొన్న

కడప

గోడౌన్ లో నుంచి స్టాక్ అందక పలు రేషన్ షాపుల మూసివేత

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కొన్ని రేషన్ షాపులకు గోడౌన్ నుండి స్టాక్ అందక మూసివేసిన రేషన్ డీలర్లు”గోడౌన్ నుంచి స్టాక్ అందలేదు అందిన తర్వాత షాపు ఓపెన్ చేస్తాం” అంటూ బోర్డులు ఉంచారు. ప్రజలు రేషన్ కోసం వచ్చి ఈ బోర్డులను చూసి వెను తిరుగుతున్నారు కావున ఎమ్మార్వో గారు వెంటనే స్పందించి స్టాక్ పంపవలసిందిగా ప్రజలు కోరుతున్నారు

కడప

ఘనంగా గీతా జయంతి వేడుకలు

మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిని హిందువులు జరుపుకుంటారు ఈ రోజున ప్రొద్దుటూరులోని పలు ఆధ్యాత్మిక సంస్థలు గీతా జయంతి వేడుకలను ఘనంగా ప్రారంభించారు ఈ వేడుకల్లో పిల్లలతో భగవద్గీత శ్లోకాల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు ఆధ్యాత్మికవేత్తలు భక్తులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.