Saturday, 14 March 2026

Blog

E-పేపర్

సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. ఆ పదవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ..

పున్నమి ప్రతినిధి: సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. ఆ పదవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ.._* _తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) చైర్మన్లు, డైరెక్టర్లతో కూడిన పాలకవర్గాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది._ దీంతోపాటు తొమ్మిది జిల్లాలకు చెందిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCB) పాలకవర్గాలను కూడా తొలగిస్తూ శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని సహకార రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. *_పదవీకాలం ముగింపు.._* _రాష్ట్రంలోని సహకార సంఘాలకు గత ప్రభుత్వం హయాంలో 2020 ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగాయి._ _నిబంధనల ప్రకారం ఐదేళ్ల_ _పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసింది. అయితే,_ _పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీరి_ _పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే_ _పూర్తి కావడంతో, ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది._ _రైతు సంక్షేమంలో సహకార సంఘాల పాత్ర.._ _గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలు వెన్నెముక వంటివి. రైతులకు అవసరమైన తక్షణ సాయాన్ని అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. సాగు అవసరాల కోసం రైతులకు స్వల్పకాలిక , మధ్యకాలిక రుణాలను అందజేయడం చేస్తుంటాయి. వీటితో పాటు.. సొసైటీల ద్వారా సబ్సిడీపై నాణ్యమైన ఎరువులు, విత్తనాలను రైతులకు సరఫరా చేస్తాయి. ప్రభుత్వం మద్దతు ధరతో చేపట్టే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో పీఏసీఎస్ కీలక బాధ్యత వహిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వ్యవసాయ అనుబంధ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం కూడా దీని బాధ్యత._ *_పర్సన్ ఇన్ చార్జ్ (PIC) పాలన దిశగా.._* _పాలకవర్గాల రద్దు నేపథ్యంలో.. పీఏసీఎస్, డీసీసీబీల నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్ చార్జ్ (Person In Charge) కమిటీలకు లేదా ప్రభుత్వ అధికారులకు అప్పగించనున్నారు. ముఖ్యంగా తొమ్మిది జిల్లాల డీసీసీబీలకు జిల్లా కలెక్టర్లను బాధ్యులుగా నియమించడం ద్వారా పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో సహకార ఎన్నికలకు మార్గం సుగమం కానుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఈ సంఘాలను పునర్వ్యవస్థీకరించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది._

తిరుపతి

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 19. శ్రీకాళహస్తి పట్టణంలో ఈ నెల 21 తారీకున జరుగు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు యస్.ఆర్. కాలనిలోని రోటరీ క్లబ్ సభ్యులు, విద్యా జ్యోతి స్కూల్ విద్యార్థులటో కలసి పట్టణంలోని నాలుగు మాడ వీధుల మీదుగా ర్యాలీ నిర్వహించడం జరిగినది, ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పసుపులేటి పార్థసారథి, సెకరెటరీ పి.సుధాకర్ రోటరీ క్లబ్ సభ్యులు వేణుగోపాల్, డాక్టర్ వెంకటరమణ, కండ్రిగ ఉమా, చంద్రప్ప , వెంకట ముని, గురపచెట్టి, సిద్దులయ్య, ప్రమీల, సదానందం, జనార్ధన్, చెంగరెడ్డి, కృష్ణ కుమార్ ,విజయ్ కుమార్, మేఘదీప్, శ్యామ్, ఇతర సభ్యులు విద్యా జ్యోతి కరస్పాండెంట్ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సిబ్బంది కృష్ణ, షబ్బీర్, పల్స్ పోలియో అవగాహన ర్యాలీ దిగ్విజయం చేయడం జరిగింది.

తిరుపతి

నాసిక్ లోని అగ్రిఫాం సందర్శించిన జై జవాన్, జై కిసాన్ టీమ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాబార్డ్, మేనేజ్ ద్వారా ఎన్నుకోబడిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి సైనికులు, మాజీ సైనికులు జై జవాన్ జై కిసాన్ ప్రోగ్రాం ద్వారా ఎన్నుకోబడిన సైనికులు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, మాలేగావ్ నందు నిర్మితమైన వెంకటేశ్వర అగ్రి ఫామ్ సుమారు 530 ఎకరాల ఏర్పడిన ఇంటి గ్రేట్ ఫార్మింగ్ సందర్శించి వారు సాగు చేస్తున్న ఆర్గానిక్ వ్యవసాయంలో భాగంగా, ద్రాక్ష, పసుపు, దానిమ్మ, నీరు నిలవ గుంటలో చేపల పెంపకం, ఆర్గానిక్ అగర్బత్తి తయారీ, ఆర్గానిక్ పెయింట్ తయారీ, బయోగ్యాస్, దాదాపు 2000 గిరి ఆవుల పెంపకం, మిశ్రమ పంటల పెంపకం, ఆర్మీలో చేరాలనుకున్న యువతకు శిక్షణ వివరాలను వెంకటేశ్వర అగ్రిఫామ్ చైర్మన్ శివాజీ రావు డోలే, వాళ్ల సిబ్బంది చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రియదర్శిని, ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ సైనికులు పులి శ్రీకాంత్, కోటేశ్వరరావు, మహేశ్వర్ రెడ్డి, వెంకటేష్ ప్రసాద్, నాగ శేషు, అశ్వంత్ రెడ్డి, పాల్గొనడం జరిగింది.

తిరుపతి

హజ్ యాత్రికు వెళ్లే హాజీలకు ప్రభుత్వ లక్ష ఆర్థిక సాయం

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ హజ్ యాత్రికు వెళ్లే హాజీలకు ప్రభుత్వ లక్ష ఆర్థిక సాయం చేస్తుందని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విజయవాడ నుంచి వెళ్లే హాజీలకు రూ.లక్ష ఆర్థిక అందచేస్తున్న ఆర్థిక చేయూతను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరుతూ.. ఆదాయంతో నిమిత్తం లేకుండా విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్లే యాత్రికులందరికీ మైనారిటీ సంక్షేమ శాఖ రూ.లక్ష సాయం అందిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల ఎంబార్కేషన్ కేంద్రాల నుండి వెళ్లే యాత్రికుల విమాన చార్జీల కంటే ఎక్కువ మొత్తం విజయవాడ నుంచి వెళ్లే వారిపై పడుతున్న భారం తగ్గించేందుకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని గన్నవరం విమానాశ్రయం పరిసర జిల్లాల యాత్రికుల సౌకర్యార్థం, ఏపీ రాజధానిగా అమరావతి ప్రాముఖ్యతను మరింత పెంచేందుకు, విజయవాడ నుండి హజ్ కి వెళ్లే యాత్రికులందరికీ ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం నుండి హజ్ కి వెళ్లే వారంతా విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంచుకుని ఆర్థిక సాయంను సద్వినియోగం చేసుకోవాలని. శ్రీకాళహస్తిలో వున్న ముస్లిం హాజీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారని ఆయన పేర్కొన్నారు.

తిరుపతి

నేడు వైయస్. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఉదయం 09:00 గంటలకు శ్రీకాళహస్తి పట్టణం, రామసేతు బ్రిడ్జి (పాత బ్రిడ్జ్, రవి మెస్) వద్ద నుండి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించుబడునని వైకాపా నాయకులు ప్రకటన ద్వార తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి పట్టణ, మండల,ఏర్పేడు మండలం, రేణిగుంట టౌన్, మండలం, తొట్టంబేడు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు,కార్యకర్తలు అనుబంధ విభాగాల సభ్యులు ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొనవలసిందిగా వారు పిలుపునిచ్చారు.

తిరుపతి

పోలియో రహిత సమాజ కోసం అందరు కృషి చేయాలని…. డాక్టర్ బాలు

శ్రీకాళహస్తి పట్టణంలోని, శ్రీరామ్ నగర్ కాలనీ యు పి హెచ్ సి హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలు పోలియో రహిత సమాజ కోసం అందరు కృషి చేయాలన్నారు. ఈనెల 21వ తేదీ నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని పోలియో తీవ్రమైన వైరల్ వ్యధని అది పిల్లల్లో వికలాంగతకు దారితీస్తుందన్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో, దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, అంగన్వాడి కేంద్రాల్లో, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతాలలో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఐదు సంవత్సరాలలో తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు మీ సమీప పోలియో బూత్ కేంద్రాలకు వెళ్లి పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. రెండు చుక్కలు_ మీ జీవితానికి రక్షణ అనే నినాదంతో 22,23వ తేదీలలో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన తెలిపారు.

తిరుపతి

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి గ్రామంలో శుక్రవారం నాడు శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో దాదాపు 150 మంది అక్కుర్తి గ్రామ మహిళలు, ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న 9,10 వ తరగతి విద్యార్ధినులు పాల్గొని వారికి సంబంధించిన స్త్రీ సంబంధిత, ఋతు క్రమ సమయంలో వారు ఎదుర్కొనే సమస్యలు, పరిశుభ్రత పాటించాలనే విషయంపై MGM హాస్పిటల్స్ డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. ఈ వైద్య శిబిరానికి విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సహాయ సహకారాలు అందించి వైద్య శిబిరం విజయవంతం కావడానికి ప్రత్యేక శ్రద్ద చూపించారు. MGM హాస్పిటల్స్ డైరెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ…శ్రీకాళహస్తి, చుట్టుప్రక్క గ్రామాల ప్రజలు ఆరోగ్యం కోసం అత్యాధునిక వైద్యసదుపాయాలతో MGM హాస్పిటల్స్ స్థాపించామని ప్రజలు సద్వినియోగ పరచుకొవాలని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో MGM హాస్పిటల్స్ స్త్రీ సంబంధిత వైద్యురాలు లక్ష్మి ప్రస, చిన్నపిల్లల సంబంధిత వైద్యులు డాక్టర్ ఉమా మహేశ్వర్ రావు, MGM హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

బాదితులకు సి.యం.ఆర్.యఫ్.చెక్కులు అందజేసిన బొజ్జల బృందమ్మ

శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో తొట్టంబేడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావెళ్ళ ముని రాజా నాయుడు అధ్యక్షతన బాదితులకు CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయనిధిని అందుకున్నావారు చిన్న కనపర్తి P. రోషన్, రి గుర్రప్ప నాయుడు కండ్రిగ C.రామానాయుడు, శేషమ్మ నాయుడు కండ్రిగ G. జ్ఞాపిక, పూడి చెరుకు నరసింహనాయుడు, గంప మాధవి, వారలకు బొజ్జల బృందమ్మ చేతులమీదుగా అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో యూనిటీ ఇన్చార్జులు లెక్కల మురళి నాయుడు గారు, బాలాజీ, అడ్వకేట్ కమల్, కనపర్తి వాసు నాయుడు, వ్యవసాయం మార్కెట్ కమిటీ డైరెక్టర్ చలపతి, భూతి ఇన్చార్జులు శంకర్ నాయుడు, గుత్తా విజయ నాయుడు, సుశేఖర్ నాయుడు, ఎస్సీ సెల్ నాయకులు కొత్త కండ్రిక రాము, వినోదు, గుర్రప్ప , నందిపాటి పరుశురాం, మెరిమి వెంకటసుబ్బయ్య, చీకటి వేణు, ఈడూరు రామయ్య, ఉప సర్పంచ్ కంచిపల్లి రాజేష్, సీనియర్ నాయకులు చోడవరం చంద్రారెడ్డి ,కాసరం భాస్కర్ నాయుడు, దారపునేని ప్రభాకర్ నాయుడు , రమణారెడ్డి, మంగారెడ్డి , మహిళా అధ్యక్షురాలు కనపర్తి రమాదేవి ,రేణుకమ్మ ,సర్పంచ్ మాధవి ,గోగినేని కుమారి, గ్రామ ప్రజలు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు గౌll శ్రీ పవన్ కళ్యాణ్ గారితో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు భేటీ*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు గౌll శ్రీ పవన్ కళ్యాణ్ గారితో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు భేటీ* *అమరావతి డిసెంబర్ 19విశాఖ పున్నమి ప్రతినిధి* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు గౌll శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంగళగిరిలోని తన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ‘వన్ టూ వన్’ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి గౌll శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. *నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను , ఇప్పటివరకు నెరవేర్చిన హామీలను డి సిఎం గారికి వివరించిన ఎమ్మెల్యే వంశీ గారు* *నియోజవర్గంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అభ్యర్థన* *సమావేశంలోని ముఖ్య అంశాలు:* *అభివృద్ధి పనుల సమీక్ష* : దక్షిణ నియోజకవర్గం లోఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎంకు వివరించారు. * *పనుల పురోగతి* : నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు మేజర్ పనుల ప్రస్తుత స్థితిగతులు, వాటిని సత్వరమే పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు మరియు సహాయ సహకారాలపై చర్చించారు. *స్థానిక సమస్యలు* : నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. వాటిలో ముఖ్యంగా ఎండోమెంటు సమస్యను వివరించారు. **పార్టీ బలోపేతం* : నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ మరియు క్యాడర్‌ను సమన్వయం చేసుకునే అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ రోజు మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు సూచించారు.

విశాఖపట్నం

ఆహార పరిశుభ్రత, నాణ్యతపై తయారీదారులకు శిక్షణ ఇస్తాం.

ఆహార పరిశుభ్రత, నాణ్యతపై తయారీదారులకు శిక్షణ ఇస్తాం. *విశాఖ పట్నం డిసెంబర్ 19పున్నమి ప్రతినిధి*. ఆహార పరిశుభ్రత, వాటి నాన్యాతలపై ఆహార తయారీ దారులకు అవసరమైన శిక్షణ ఇస్తామని విశాఖ పట్నం జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కల్యాణ చక్రవర్తి తెలిపారు. ఇటీవల అమరావతి దరి మంగళగిరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆహార భద్రతాధికారులకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వీర పాండ్యన్ ఆధ్వర్యంలో ఆహార పరిశుభ్రత, నాణ్యత, భద్రత అనే అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించా రన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో తమకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షకుడు డాక్టర్ దినేష్ ఆహార భద్రతకు సంబంధించిన పలు విషయాలపై శిక్షణ ఇచ్చారన్నారు. నగరంలో ఉన్న హోటల్స్, క్యాటరింగ్ నిర్వాహకులు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, పానీ పూరీ బండ్లు, కర్రీ పాయింట్స్, టిఫిన్ సెంటర్స్ తదితర ఆహార తయారీదారులకు పరిశుభ్రత, ముడి పదార్థాల నాణ్యత, ప్యాకింగ్ జాగ్రత్తలు తదితర విషయాలపై త్వరలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తా మన్నారు. ఆహార తయారీ దారులు ఆహార పదార్థాలను తయారు చేసేటప్పడు తలకు క్యాప్, నోటికి మాస్క్ ధరించడం, గోర్లు కత్తిరించు కోవడం, అంటు వ్యాధులు, గాయాలు లేకుండా చూసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తదితర జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. వీటన్నింటి నిర్వహణపై ఆహార తయారీ దారులకు త్వరలో సమగ్ర శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తా మన్నారు. ఆహార తయారీ దారుల ఆధార్ నంబర్స్, ఫోన్ నంబర్స్ తీసుకుని వాటిని తమ వెబ్సైట్ లో నమోదు చేస్తామన్నారు. అనంతరం వారికి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇస్తామన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను వచ్చే నెల విడుదల చేస్తా మన్నారు. గతంలో ప్రైవేట్ వ్యక్తులు కొంత అమౌంట్ తీసుకుని ఇటువంటి శిక్షణ ఇచ్చే వారని, ప్రస్తుతం తామే ఉచితంగా ఈ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ కూడా ఇస్తామన్నారు. సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారి జి.వి.అప్పారావు మాట్లాడుతూ ప్రజారోగ్యానికి అవసరమైన ఈ ఆహార భద్రతా శిక్షణను ప్రతి ఆహార తయారీ దారుడు విధిగా తీసుకుని, తామిచ్చే ధృవీకరణ పత్రం పొందాలన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.