Saturday, 14 March 2026

Blog

కామారెడ్డి

సర్పంచ్ బండి ప్రవీణ్‌తో ఎమ్మెల్యే మదన్మోహన్ సెన్సేషనల్ మీటింగ్..

రామారెడ్డి మండలం మోడల్‌గా మారబోతుందా? షాకింగ్ ప్రామిస్! కామారెడ్డి,20 డిసెంబర్, పున్నమి ప్రతినిధి ) కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రం సంచల నం సృష్టించింది! సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన బండి ప్రవీణ్‌కు ఎమ్మెల్యే మదన్మోహన్ స్పెషల్ గిఫ్ట్.. హైదరాబాదులో తన నివాసంలోనే రహస్య కలయిక! మండలానికి కావాల్సిన అన్ని నిధులు, పథకాలు ఒక్కటి కూడా తప్పకుండా అందుతా యి.. నేనే పర్సనల్‌గా చూస్తాను!” అం టూ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మాటిచ్చారు. అంతే కాదు.. పాలక వర్గం రామారెడ్డి మండలాన్ని మోడల్ మండలంగా తీర్చిదిద్దాలని స్పష్టమైన ఆర్డర్!ఈ మీటింగ్‌తో రామారెడ్డి మండల ప్రజలు సంతోషంగా ఉన్నారు. బండి ప్రవీణ్ విజయం ఇప్పుడు మండల అభివృ ద్ధికి సూపర్ బూస్ట్ అవుతుందా? రామారెడ్డి మోడల్ మండలంగా మారితే.. తెలంగాణలోని ఇతర మండలాలకు ఇది ట్రెండ్ సెటర్ అవుతుం ది! మండల ప్రజలు ఎదురు చూస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం – గునుకుల కిషోర్

నెల్లూరు డిసెంబర్ (— పున్నమి ప్రతినిధి) నెల్లూరు సిటీ 16వ డివిజన్ గుర్రాల మడుగు సంఘం వద్ద రోడ్ల పనులపై స్థానికుల అభ్యంతరాలను జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పరిశీలించి సమన్వయం చేశారు. అభివృద్ధిలో పక్షపాతం ఉండదని, ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీఎస్సీ, పోలీస్ ఉద్యోగాలు రావడం మంచి పాలనకు నిదర్శనమన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి పొంగూరు నారాయణల నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు

అనపర్తి — పున్నమి ప్రతినిధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఇంధన పొదుపుతో భావితరాలకు వెలుగు నింపవచ్చని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యుత్ ఏఈ వీరభద్రరావు విద్యుత్ ఆదా అవసరాన్ని వివరించారు. పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ మల్లిడి పార్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సినిమా హాల్లలో దోపిడీ…….

సినిమా పేరు తో దోపిడీ చేస్తున్న హాల్ మేనేజ్మెంట్, కోల్డ్రింగ్స్ మార్ప్ ధరలకు కాకుండా వారి ఇష్టానుసారం అమ్ముతున్నారు సినిమా చూస్డం అని వెళ్లిన మధ్య తరగతి జనాల పరిస్థితి ఏంటి?, కోల్డ్రింగ్ 250 ఎంఎల్ బైట 20 రూ కానీ సినిమా హాల్ లో 300 ఎంఎల్ 50 రూ అలాగే ఎన్నో పాప్కార్న్ అని స్వీట్ కార్న్ అని వాటర్ బాటిల్ 20 రూ ఐతే 30 రూ వసూలు చేసి ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు వీటో పై కఠిన చర్యలు తీసుకోవాలి లేకుంటే సామాన్య మానవుడు చినిమ చూడాలి అంటే భయపడే రోజులు వస్తాయి, సరదాగా కుటుంబం తో సినిమా చూడాలి అని 500 రూ టికెట్లకు ఖర్చు చేస్తే అదనగా 1000 రూ తినుబండారాలకు మరియు కూల్డ్రింక్స్ కి పెట్టవలసి వస్తుంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో 17 మంది పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు

నెల్లూరు , డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్య పరిధిలో జిల్లా పరిషత్ ,మండల పరిషత్ ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులు 17 మందికి జూనియర్ సహాయకులు మరియు టైపిస్టులకు సీనియర్ సహాయకులుగా పదోన్నతి లభించింది పై పదోన్నతి ఉత్తర్వులు జడ్పీ చైర్ పర్సన్ గారు గౌరవనీయులు శ్రీమతి ఆనం అరుణమ్మ గారు జెడ్పీ సీఈవో గౌరవనీయులు శ్రీ ఎల్ శ్రీధర్ రెడ్డి గారు జడ్పీ డిప్యూటీ సీఈవో గౌరవనీయులు శ్రీ జే మోహన్ రావు గారు చేతుల మీదగా పదోన్నతి ఉత్తర్వులు అందజేసినారు పై పదోన్నతి ఉత్తర్వులు సహకరించిన జడ్పీ చైర్మన్ గారికి సీఈఓ గారికి డిప్యూటీ సీఈఓ గారికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అయిన శ్రీ లక్కాకుల పెంచలయ్య శ్రీ వి దేవ ప్రసన్నకుమార్ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు

ఆంధ్రప్రదేశ్

రేపే పల్స్ పోలియో::తల్లితండ్రులు మర్చిపోవద్దు

*తల్లితండ్రులు మర్చిపోవద్దు.. రేపే పల్స్ పోలియో* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో నిర్వహించనున్నారు.. *ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను* తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్య కుమార్ సూచించారు.. రాష్ట్రంలోని 54,07,663 మంది చిన్నారులకు 38,267 బూత్లు ఏర్పాటు చేశారు. 61,26,120 డోస్లను జిల్లాలకు సరఫరా చేశారు. ఏదైనా కారణంతో రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు…

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు మేయర్ ఇన్‌చార్జ్‌గా రూపుకుమార్ యాదవ్‌కు జంగమ నాయకుల అభినందనలు

నెల్లూరు — పున్నమి ప్రతినిధి నెల్లూరు నగర మేయర్‌గా ఇన్‌చార్జ్ బాధ్యతలు స్వీకరించిన రూపుకుమార్ యాదవ్‌కు బేడ బుడగ జంగమ నాయకులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజాసేవలో ఆయనకు ఉన్న అనుభవం, నిబద్ధత నగర అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దశరథరామయ్య, కల్పం రమేష్, ఉద్దండి అమరలింగం, కందుకూరి అంకలింగం, చేజర్ల సుధాకర్, ఉద్దండి కోటేష్, పంచాక్షరి మల్లయ్య, ముత్యాల పిచ్చయ్య, కల్పం శ్రీనివాసులు, గంధవల్ల ఉమాశంకర్ పాల్గొన్నారు.

హైదరాబాద్

టెట్ విషయంలో ఉపాధ్యాయులకు సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలి వేసవి సెలవుల్లోనే శాస్త్రీయంగా ఉంటుంది

*టెట్ విషయంలో ఉపాధ్యాయుల ప్రయోజనం పరిగణలోకి తీసుకోవాలి* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జాయింట్ సెక్రెటరీ ప్రభుత్వానికి డిమాండ్* *పున్నమి ప్రతినిధి 20 /12/ 2025* *🍥రాష్ట్రంలో జనవరి 3 నుంచి 20 నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను వాయిదా వేయాలని అలాగే పేపర్ 3 హిందీ తెలుగు భాషలకు సంబంధించిన వారికి ప్రత్యేకంగా నిర్వహిస్తే వారికి శాస్త్రీయంగా ఉంటుందని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట జాయింట్ సెక్రెటరీ ఎండి అమీర్ పాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఇరవై రోజులుగా రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, సహాయక ప్రిసైడింగ్ అధికారులుగా బాధ్యతను నిర్వర్తించారని,దాని వల్ల టెట్ పరీక్షకు సన్నద్ధమవ్వడానికి తగిన సమయం వారికి లభించలేదని పేర్కొన్నారు. టెట్ పరీక్షకు సిద్ధమవ్వడానికి వారికి తగినంత సమయం ఇవ్వాలని, అందుకే జనవరి నెలలో జరగనున్న ఈ పరీక్షను వాయిదా వేయాలని వేసవి సెలవుల్లో నిర్వహిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా, సానుకూలంగా ఉంటుందని కోరారు.*

యాదాద్రి భువనగిరి

* సంస్థాన్ సర్పంచిని సన్మానించిన పద్మశాలి కుల నాయకులు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 20 : సంస్థాన్ నారాయణపురం మండలం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పోరులో సిపిఐ పార్టీ, బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా విజయం సాధించిన ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి దంపతుల ని పద్మశాలి కుల నాయకులు అంతా కలిసి షాలువ కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాలుగో వార్డ్ మెంబర్గా గెలిచిన సురపల్లి వెంకటేశం, సింగం కృష్ణ,విడం సాయి కిషోర్ , గర్దాస్ రాఘవేంద్ర, కర్నాటి నవీన్ కుమార్,ఏలే సతీష్,గంజి అంజయ్య, తదితరులు, పాల్గొన్నారు

యాదాద్రి భువనగిరి

చల్లమల్ల కృష్ణారెడ్డి బిజెపి వైపు మొగ్గు చూపుతున్నాడా ?

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 20 : అల్లందేవిచెరువు గ్రామంలో, అధికార పార్టీ కాకుండా బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిపించడంలో, చల్లమల్ల క్రిష్ణరెడ్డి హస్తం ఉందా? అవును ఉంది అనే ఆరోపణ వినిపిస్తున్నాయి. రేపే ఎన్నికలు అనే రోజు వరకు ఊపందుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారంలో తిరిగిన కొంతమంది రెడ్డి నాయకులు ఎన్నికల రోజు కనపడకుండా ఉండటం పలు విమర్శలకు తావిస్తుంది. అదే రోజు చల్లమల్ల కృష్ణారెడ్డి బిజెపి నాయకులతో కలిసి శాలువాతో సత్కారం చేయించుకోవడం వారితో కలిసి ఉన్న ఫోటో పై పలువురు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. చలమల్ల తీరుపై కాంగ్రెస్ నాయకులు పలు ఆరోపణలు చేస్తున్నారు .బీజేపీ పార్టీ సర్పంచ్ గెలిచిన చోట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల క్రిష్ణరెడ్డి సన్మానం చేసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ? బీజేపీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి కి ఏం సంబంధం ఏమిటని ప్రశ్నార్థకంగా మిగిలింది. చల్లమల్ల బిజెపి వైపు మొగ్గు చూపుతున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి నాయకులతో కలిసి ఉండటం నిజమే అయి ఉండవచ్చునని, గెలిచిన బీజేపీ పార్టీ సర్పంచ్ ర్యాలీలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి శాలువాతో సత్కారం చేయించుకోవడంపై రెడ్డి రాజకీయం నడుస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విధంగా నాగవారిగూడెం , గొల్లగూడెం గ్రామాలకు చలమల్ల సరైన సహకారం అందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా మల్లారెడ్డిగూడెం లో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సొంతం గ్రామం లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోకపోవడం స్వతంత్ర అభ్యర్థి గెలిపించడంలో చలమల్ల పాత్ర ఉందని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. నారాయణపురం మండలంలో ఒక వర్గం ఏర్పాటు చేసుకొని, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలు తన వర్గం కాకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ఏ అభ్యర్థి నైనా ఓడించడానికి సాయ శక్తులు ప్రయత్నం చేయడం జరిగిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అల్లందేవిచెరువు,లింగ వారి గూడెం, మల్లారెడ్డిగూడెం, చిమిర్యాల, మహమ్మదాబాద్ , కంకణాలగూడెం, ఇలా చెప్పుకుంటూ వెళితే సుమారు 10 గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ గెలువనీయకుండా చేసినటువంటి చెల్లమల్ల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకుంటది అనేది వేచి ఉండాలని అంటున్నారు. వివిధ రాజకీయ నాయకులు. సొంత పార్టీ సర్పంచ్ అభ్యర్థులను ఓడించడానికి ముఖ్య పాత్ర వహిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.