తమ పై వచ్చిన ఆరోపణలు ఖందించిన నెల్లూరు కోటేశ్వరరావు, కుసంపూడి రవీందర్
ఖమ్మం జిల్లా (పున్నమి ప్రతి నిధి) సిరి గోల్డ్ ఫైనాన్స్ మీద బాధితుడు యాస నాగేశ్వరావ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హైదరాబాద్ సి సి యస్ పోలీసు లు ఏ. 1. గా కుసంపూడి రవీందర్ ఏ. 2 గా నెల్లూరు కోటేశ్వరరావు పేర్లు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కోటేశ్వరరావు, కుసంపూడి రవీందర్ లు వేరు వేరు గా ఖండిస్తు ప్రకటన లు విడుదల చేసారు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ప్రచారం కొనసాగితే పరువు నష్టం దావా వేస్తామని నెల్లూరు కోటేశ్వరరావు హెచ్చరించారు. సిరి గోల్డ్ కి తనకు గాని తన పెట్టుబడులు కి గాని ఎటువంటి సంబంధం లేదని కోటేశ్వరరావు తెలియజేసారు. సీనియర్ నాయకులు కుసంపూడి రవీందర్ మాట్లాడు తు సిరి గోల్డ్ సంస్థ ఎవరిని మోసం చేయలేదని స్పష్టం చేశారు. తమపై ఫిర్యాదు చేసిన యాసా నాగేశ్వరరావు తమ వద్ద రూ.15,000 విలుచేసే బంగారం కొనుగోలు చేశారని తెలిపారు. అయితే ఆ కొనుగోలుకు సంబంధించి నగదు చెల్లించారాని డిపాజిట్ చేయలేదని, బంగారం కొనుగోలు చేసిన సమయంలో 15000 కి రసీదు కూడా అందజేశామని పేర్కొన్నారు. తాను ఎక్కడికీ పరారై పోలేదని, తన సెల్ ఫోన్ ఎప్పుడూ అందుబాటులోనే ఉందని అన్నారు2026. మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఎల్‌బీ నగర్‌లో సిరి గోల్డ్ & డైమండ్ షోరూమ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ వ్యవహారానికి ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే తప్పకుండా పరువు నష్టం దావా వేస్తామని కుసంపూడి రవీంద్ర హెచ్చరించారు.











