Saturday, 14 March 2026

Blog

ఖమ్మం

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నిరసనగా ఖమ్మంలో విహెచ్‌పీ ఆందోళన

ఖమ్మం డిసెంబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం ZP సెంటర్ వద్ద బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడులను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణతో పాటు ఉపేందర్ గౌడ్, అల్లిక అంజయ్య, రుద్ర ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

అర్ధరాత్రి దొంగల హాల్ చల్

పెడన నియోజకవర్గం,కృత్తివెన్ను మండలం అడ్డపరు గ్రామంలో సోమవారం రాత్రి వరుస దొంగతనాలు సంచలనం సృష్టించాయి.గ్రామంలోని ఆరు ఇళ్ల లో మరియు స్థానిక రామాలయంలో దొంగలు చోరీలకు పాల్పడినట్టు సమాచారం. ఆలయంలోని అమ్మవారి మంగళ సూత్రాలు అపహారించి హుండీని పగలగొట్టినట్టు సమాచారం. ఉదయం నిద్ర లేచిన గ్రామస్తులు తలుపులు పగలగొట్టి ఉండడం, ఆలయంలో చోరీ జరగడం గమనించి బెంబేలెత్తి పోయారు. స్థానిక పోలీసులు క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ ను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు.

తెలంగాణ

రైతుల సంక్షేమమే మా బలం

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో సర్పంచ్ గారైన చీటీ సునీత వెంకట నర్సింగా రావు గారు పశు పోషకులను దృష్టిలో ఉంచుకొని మేకలకు అవసరమైన నట్టలమందును ఈరోజు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పశువులు ఆరోగ్యంగా ఉంటేనే పశుపోషకులు ఆర్థికపరంగా మెరుగవుతారు అని వారు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని వారు అన్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామంలో కొనసాగిస్తామని ప్రజలకు వారు మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులైన కాసులవాద శ్రీనివాస్ గారు రైతు మందాటి ఎల్లం మరియు గ్రామ ప్రజలు పశుపోషకులు వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తుప్పలతో ప్రమాదకరంగా మారిన రహదారి

పెదబయలు: పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పరిధిలో రూఢకోట–కుమడ మార్గం మీదుగా బూసిపుట్టు నుంచి జామిగుడ వరకు ఉన్న రహదారిలో మలుపుల వద్ద తుప్పలు విపరీతంగా పెరిగి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మించిన ఈ రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో పాటు అనేక మలుపులు ఉన్నాయి. హెచ్చరికలు, సూచిక బోర్డులు లేకపోవడంతో పాటు తుప్పలు దృశ్యాన్ని అడ్డుకోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. వెంటనే తుప్పలను తొలగించి మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

నెల్లూరుతోనే కొనసాగాలి: రాపూరు ప్రజల గళం

నెల్లూరు రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపితే తాము తీవ్రంగా నష్టపోతామని ఆ మండలవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్‌రెడ్డి, నాయకులు సురేష్, సయ్యద్ తదితరులు మాట్లాడుతూ రాపూరుకు నెల్లూరు జిల్లాతో ఉన్న పరిపాలనా, సామాజిక, ఆర్థిక అనుబంధాన్ని తెంచుకోలేమన్నారు. తిరుపతి జిల్లాలో విలీనం చేస్తే రవాణా, సేవలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంటూ, రాపూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్

జాబ్ మేళాలో 140 మందికి ఉద్యోగావకాశాలు

మచిలీపట్నం (కోనేరుసెంటర్), న్యూస్‌టుడే: కృష్ణా విశ్వవిద్యాలయంలో సోమవారం మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సమన్వయంతో నిర్వహించిన ఉద్యోగ మేళాకు మంచి స్పందన లభించింది. ఎనిమిది ప్రముఖ కంపెనీలు పాల్గొన్న ఈ మేళాలో బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ విభాగాలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 140 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఉపకులపతి ఆచార్య రాంజీ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఉష, ప్లేస్‌మెంట్ సెల్ సమన్వయకర్త సుందరకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యూజీ ఫలితాలు విడుదల: విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన యూజీ మూడో, ఐదో సెమిస్టర్ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. మూడో సెమిస్టర్‌లో 51.85 శాతం, ఐదో సెమిస్టర్‌లో 66.31 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పరీక్షల నియంత్రణాధికారి పి. వీరబ్రహ్మాచారి తెలిపారు. ఫలితాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, పునర్మూల్యాంకనానికి జనవరి 7 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్

వైజ్ఞానిక దృక్పథంతో విద్యార్థుల సృజనాత్మకత

మచిలీపట్నం (గొడుగు పేట), న్యూస్‌టుడే: విద్యార్థులు సమాజ అవసరాలకు పరిష్కారాలు చూపే పరిశోధకులుగా ఎదగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనను సోమవారం మచిలీపట్నంలోని లేడి యాంప్తిల్ కళాశాలలో ఉత్సాహంగా నిర్వహించారు. ప్రారంభోత్సవంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన వసతులు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. డీఈవో సుబ్బారావు విద్యార్థులకు వైజ్ఞానిక దృక్పథం, గణిత విజ్ఞానం అత్యంత కీలకమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 196 నమూనాలు ప్రదర్శనకు వచ్చినట్లు జిల్లా సైన్సు అధికారి మహ్మ జాకీర్ అహ్మద్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

విద్యాభివృద్ధికి ప్రాధాన్యం – మంత్రి సవిత

మోపిదేవి, న్యూస్‌టుడే: గత ఐదేళ్ల పాలనలో మునుపటి కూటమి చేపట్టిన అభివృద్ధి పనులపై సమగ్ర లెక్కలు తీసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి సవిత అన్నారు. మోపిదేవి గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహించిన ముస్తాబు కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి, వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. నాడు–నేడు రెండో దశలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోరుతూ కోలా బాలాజీ వర్మ తదితరులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

శతాబ్ద కాల చరిత్ర కలిగిన శైవక్షేత్రం

ఫిరంగిపురం: ఫిరంగిపురం మండలం పొనుగుపాడులోని గంగా, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని దేశానికి స్వాతంత్ర్యం రాకముందే భక్తులు నిర్మించారు. 1913లో ఆలయానికి శంకుస్థాపన చేయగా, 1917 ఫిబ్రవరిలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం మొదటిసారిగా స్వామివారి కల్యాణం జరిపారు. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. 2016లో శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయం ముందు ఉన్న 50 అడుగుల గాలి గోపురం, రాయి ధ్వజస్తంభం భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్

రహదారిపై తుప్పల ముప్పు

పెదబయలు: పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పరిధిలోని రూఢకోట, కుమడ మీదుగా బూసిపుట్టు నుంచి జామిగుడ వరకు ఉన్న రహదారిలో మలుపుల వద్ద తుప్పలు ఏపుగా పెరిగి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మించిన ఈ రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో పాటు ప్రమాదకర మలుపులు ఉన్నాయి. హెచ్చరికలు, సూచిక బోర్డులు లేకపోవడం, తుప్పలు దృశ్యాన్ని అడ్డుకోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. వెంటనే తుప్పలను తొలగించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.