జాతీయ రైతు దినోత్సవంలో ఘన కార్యక్రమం.. సర్పంచ్ బండి ప్రవీణ్ కుమార్ రైతులకు శుభాకాంక్షలు
కామారెడ్డి 23 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం దేశానికి ఐదవ ప్రధానమంత్రిగా సేవలందించిన రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన చౌదరి చరణ్ సింగ్ జయంతిని గౌరవంగా స్మరించుకున్నారు. గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ కుమార్ మాట్లాడు తూ,రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలోపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభు త్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.రైతుల సమస్యలు, అవసరాలపై చర్చించి, వాటి పరిష్కారానికి అందరూ కలిసి కృషి చేయాలని సర్పంచ్ సూచించారు.ఈ కార్యక్రమం లో ఉత్తమ రైతులను అభినందించి, గౌరవించారు. యువత వ్యవసాయ రంగంలో ఆసక్తి చూపి, దేశ అభివృద్ధికి రైతులకు మరింత కృషి చేయాలని, యువత వ్యవసాయం వైపు ఆకర్షితులై సహకరిం చాలని పలువురు పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మం రైతులలో ఉత్సాహాన్ని, ఐక్యతను పెంచింద న్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు పిప్పిరి లింబాద్రి, చింతకుంట భాస్కర్, గ్రామ పెద్దలు గాండ్ల నరసింహులు, రైతులు ఒంటరి ప్రతాప్ రెడ్డి, కాటం నర్సయ్య, రవి,రమేష్, గ్రామ సెక్రటరీ ప్రశాం త్, సిబ్బంది శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.











