Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ను నిర్వీర్యం చేయొద్దు బి ఆర్ ఎస్

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ను నిర్వీర్యం చేయొద్దు: బీఆర్ఎస్
రాజన్న సిరిసిల్ల ఆగస్టు 17 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్: కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ముస్తాబాద్‌లోని బీఆర్ఎస్ మండల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ పట్టణ అధ్యక్షుడు రాచమడుగు సంతోష్‌రావు, రాష్ట్ర నాయకుడు మెంగని మనోహర్ మరియు శీలం స్వామి మాట్లాడారు. మరియు ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే ఈ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పథకం నిలిచిపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *