ఏర్పేడు, ఏప్రిల్ 19 (పున్నమి న్యూస్( యువత సేవా దృక్పథంతో ముందుకు వస్తే సమాజంలో మార్పు సాధ్యమని ఏర్పేడు ఎస్.ఐ. శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఏర్పేడు సంత మైదానంలో యువ సమాజ్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్ 7వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విశేష స్పందనతో విజయవంతమైంది. ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ గానుగ పెంట రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు తాళిక్కాల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతి రూయా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో 33 మందికి పైగా యువకులు, స్వచ్ఛంద దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు రమేష్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఆదుకోవడమే లక్ష్యంగా గత ఏడేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తదానం చేసిన ప్రతి దాతకు, సహకరించిన ఎస్.ఐ. కి, సంస్థ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూయా బ్లడ్ బ్యాంక్ కౌన్సిలర్ రమేష్ మాట్లాడుతూ.. సకాలంలో రక్తం అందక ఇబ్బంది పడే పేద రోగులకు ఈ రక్తం ఎంతో ప్రాణదానం చేస్తుందని, ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రూయా సిబ్బంది షీలా, పాపు, స్వాతి, శీనుతో పాటు ట్రస్ట్ సభ్యులు శేషాద్రి, కిషోర్, నరేష్, వంశీ, వెంకటేష్, కిరణ్, ప్రకాష్, హరీష్, మురళీ, వేణు, చందు మరియు పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొన్నారు.

ఏర్పేడులో రక్తదాన శిబిరం సక్సెస్-33 మంది దాతల ఉదారత