శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని మహేష్ కళ్యాణ సదన్‌లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం (ఆర్ఎస్ఎస్) శతవసంతాల సందర్భంగా హిందూ సమాజంలోని కుల పెద్దల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశం శ్రీకాళహస్తి ఖండ కార్యవాహ వెంకట సుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణి సభ్యుడు దువ్వూరు యుగంధర్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువుగా మార్గనిర్దేశం చేసిన హిందూ సమాజం ఆధ్యాత్మిక, విద్యా, సాంస్కృతిక, సేవా, సామాజిక మరియు ధార్మిక రంగాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించిందన్నారు. బలమైన కుటుంబ వ్యవస్థ, పెద్దల పట్ల గౌరవం, గురువుల పట్ల భక్తి వంటి విలువలతో సమాజంలో ఆత్మీయత నిండిన జీవన విధానం కొనసాగిందని అయితే కాలక్రమంలో విదేశీ దురాక్రమణలు, బలవంతపు మత మార్పిడులు వంటి పరిణామాల వల్ల హిందూ సమాజంలో కొన్ని అవలక్షణాలు ఏర్పడి సమాజం బలహీనపడిందన్నారు. విదేశీ మతాల ప్రభావం కూడా మన జీవన విధానంలోకి చొరబడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న హిందూ సమాజ మహత్తును తిరిగి స్థాపించుకోవడం ప్రతి హిందువు బాధ్యతని ముఖ్యంగా హిందూ సమాజంలోని కుల పెద్దలు, ఆధ్యాత్మిక వేత్తలు, ధార్మిక నాయకులు తమ తమ సామాజిక వర్గాల్లో హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేస్తూ సమాజంలో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని మత మార్పిడులు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించి హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన కుల పెద్దలు, సామాజికవేత్తలు, వివిధ రంగాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

హిందూ ఐక్యతకు శ్రీకాళహస్తిలో కుల పెద్దల సమావేశం