పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 7
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మణాచారి భవన్లో సిపిఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశాలు ఇందిరమ్మ అధ్యక్షతన జరిగాయి ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ గారు హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రభుత్వంపై ప్రజా పోరాటాలు చేయడానికి సిపిఐ శ్రేణులు ప్రజా సంఘాలు సిద్ధం కావాలని ఆయన అన్నారు అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని వాటిని సరి చేయకపోతే సిపిఐ పక్షాన కొల్లాపూర్ నియోజకవర్గ లో త్వరలోనే అన్ని మండల కేంద్రాలను సిపిఐ పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఒకవైపు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కమ్యూనిస్టులు ముందుంటారని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదేపదే చెప్తున్న దానికి భిన్నంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతుందని కమ్యూనిస్టులు ఎన్నికల అప్పుడు మాత్రమే అవసరం తర్వాత వారి అవసరం లేదనే విధంగా గౌరవ మంత్రివర్యులు ప్రవర్తిస్తున్న తీరు సరైనది కాదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందాలని లేకపోతే విడతలవారీగా ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాటం చేయడానికి వెనకడుగు వేసేది లేదని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పార్టీ బలం ఉన్న ప్రతి చోట పోటీ చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశవులు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు టి నరసింహ, విజయుడు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కృష్ణాజి, మర్యాద వెంకటయ్య, శంకర్ గౌడ్, బిజ్జా శ్రీను, బండి లక్ష్మీపతి, శివశంకర్, రవీందర్, తుమ్మల శివుడు, మల్లేష్, పరశురాములు, గడ్డం శ్రీను, గోపాల్, మధు గౌడ్, నరేష్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు

ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 7 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మణాచారి భవన్లో సిపిఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశాలు ఇందిరమ్మ అధ్యక్షతన జరిగాయి ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ గారు హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రభుత్వంపై ప్రజా పోరాటాలు చేయడానికి సిపిఐ శ్రేణులు ప్రజా సంఘాలు సిద్ధం కావాలని ఆయన అన్నారు అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని వాటిని సరి చేయకపోతే సిపిఐ పక్షాన కొల్లాపూర్ నియోజకవర్గ లో త్వరలోనే అన్ని మండల కేంద్రాలను సిపిఐ పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఒకవైపు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కమ్యూనిస్టులు ముందుంటారని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదేపదే చెప్తున్న దానికి భిన్నంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతుందని కమ్యూనిస్టులు ఎన్నికల అప్పుడు మాత్రమే అవసరం తర్వాత వారి అవసరం లేదనే విధంగా గౌరవ మంత్రివర్యులు ప్రవర్తిస్తున్న తీరు సరైనది కాదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందాలని లేకపోతే విడతలవారీగా ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాటం చేయడానికి వెనకడుగు వేసేది లేదని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పార్టీ బలం ఉన్న ప్రతి చోట పోటీ చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశవులు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు టి నరసింహ, విజయుడు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కృష్ణాజి, మర్యాద వెంకటయ్య, శంకర్ గౌడ్, బిజ్జా శ్రీను, బండి లక్ష్మీపతి, శివశంకర్, రవీందర్, తుమ్మల శివుడు, మల్లేష్, పరశురాములు, గడ్డం శ్రీను, గోపాల్, మధు గౌడ్, నరేష్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు

