మంథని, ఆగస్టు 29: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నేటి నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పోతు జ్యోతి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల స్థలం, అలాగే ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నవిధంగా పింఛన్, గుర్తింపు కార్డులు, ఉచిత బస్సు, రైలు ప్రయాణం హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు.
అలాగే బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం పార్టీల పెద్దలు సైతం ఉద్యమకారుల హామీల అమలుపై అసెంబ్లీలో గొంతెత్తి ఉద్యమకారులకు అండగా ఉంటామని ప్రకటించాలని జ్యోతి రెడ్డి ఆయా పార్టీలను కోరారు.


