స్వామి విద్యానికేతన్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

0
212

స్వామి విద్యానికేతన్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
విశాఖపట్నం ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం నేపథ్యంలో, విశాఖపట్నం జిల్లా డీఈఓ శ్రీ ప్రేమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు, స్వామి విద్యానికేతన్ హై స్కూల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో కూర్మమ్మ స్కౌట్స్ ట్రూప్ మరియు గైడ్స్ కంపెనీ విద్యార్థులు భాగస్వాములై, సాయిరాం నగర్ పరిసరాల్లో విస్తృతంగా శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా:
• కాల్వల పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం
• నీటి పంపుల వద్ద పేరుకుపోయిన నాచు, వ్యర్ధాలను శుభ్రపరచడం
• పూల మొక్కలను ట్రిమ్ చేయడం
• పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచడం

అంతేకాక, విద్యార్థులందరూ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేసిన అనంతరం, స్థానిక ప్రజలకు స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డా. లక్ష్మణస్వామి పాలూరు గారు, విద్యార్థుల చొరవను అభినందిస్తూ, “పిల్లలు చిన్న వయస్సులోనే స్వచ్ఛతకు ప్రాధాన్యతనిచ్చి, సమాజానికి మార్గదర్శకులవుతారు” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ టీచర్ గరిమెళ్ల పద్మజా పూర్ణ, తూర్పాటి సూర్యకుమారి, సింగిరెడ్డి లక్ష్మి, సాలపు రూపులత, అచ్యుతని లక్ష్మి, వీర కుమార్ మాస్టారు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి పాలూరు దేవి గారు విద్యార్థుల సేవా మానసికతను అభినందించారు.

0
0