నంద్యాల ఎన్టీఆర్ షాది ఖానా నందు నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల మతలకు అతీతంగా సూపర్ సిక్స్ పథకాలు అందరికీ అందజేస్తున్నామని, అదేవిధంగా ‘క్యూఆర్ కోడ్ సౌకర్యంతో కూడిన ఈ కార్డును స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుడు సరుకులు తీసుకున్న వివరాలు వెంటనే ప్రభుత్వానికి చేరుతాయిని . దీంతో పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని. పోర్టబులిటీ విధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం.’ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ , నంద్యాల ఆర్డీవో , మున్సిపల్ కమిషనర్ , ప్రజా పంపిణీ అధికారులు , ప్రభుత్వ అధికారులు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


