Monday, 23 March 2026
  • Home  
  • స్నేహ బంధాల స్వర్ణోత్సవం… జ్ఞాపకాల జాతరగా మారిన హిందుస్థాన్ షిప్ యార్డ్ హై స్కూల్ 1988–89 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం
- విశాఖపట్నం

స్నేహ బంధాల స్వర్ణోత్సవం… జ్ఞాపకాల జాతరగా మారిన హిందుస్థాన్ షిప్ యార్డ్ హై స్కూల్ 1988–89 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం

హిందుస్థాన్ షిప్ యార్డ్ హై స్కూల్‌లో 1988–89 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నగరంలోని ఒక పార్కులో అత్యంత వైభవంగా నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలను తిరగేసుకుంటూ, నవ్వులు–ముచ్చట్లు–మధురానుభూతులతో ఈ కార్యక్రమం నిజంగా ఒక జ్ఞాపకాల జాతరగా నిలిచింది. ఈ సమ్మేళనానికి అదే బ్యాచ్‌కు చెందిన, ప్రస్తుతం భారత్ సంచార్ లిమిటెడ్ (BSNL) సంస్థలో ఏజీఎంగా నాగాలాండ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వానపల్లి కిషోర్ హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్నో ఏళ్ల తర్వాత బాల్య స్నేహితులతో కలసి గడిపిన క్షణాలు ఆయనకు కూడా అపారమైన ఆనందాన్ని ఇచ్చాయి. ఈ సందర్భంగా వానపల్లి కిషోర్ మాట్లాడుతూ, “చిన్ననాటి చిలిపి జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకుంటూ ఇలా నవ్వుతూ హాయిగా బతకడం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇటువంటి సమావేశాలు మన జీవితానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి” అని అన్నారు. స్నేహం, అనుబంధం, జ్ఞాపకాల విలువను మరోసారి గుర్తు చేసిన ఈ సమ్మేళనం హాజరైన ప్రతి ఒక్కరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

హిందుస్థాన్ షిప్ యార్డ్ హై స్కూల్‌లో 1988–89 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నగరంలోని ఒక పార్కులో అత్యంత వైభవంగా నిర్వహించారు.
చిన్ననాటి జ్ఞాపకాలను తిరగేసుకుంటూ, నవ్వులు–ముచ్చట్లు–మధురానుభూతులతో ఈ కార్యక్రమం నిజంగా ఒక జ్ఞాపకాల జాతరగా నిలిచింది.
ఈ సమ్మేళనానికి అదే బ్యాచ్‌కు చెందిన, ప్రస్తుతం భారత్ సంచార్ లిమిటెడ్ (BSNL) సంస్థలో ఏజీఎంగా నాగాలాండ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వానపల్లి కిషోర్ హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్నో ఏళ్ల తర్వాత బాల్య స్నేహితులతో కలసి గడిపిన క్షణాలు ఆయనకు కూడా అపారమైన ఆనందాన్ని ఇచ్చాయి.
ఈ సందర్భంగా వానపల్లి కిషోర్ మాట్లాడుతూ,
“చిన్ననాటి చిలిపి జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకుంటూ ఇలా నవ్వుతూ హాయిగా బతకడం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇటువంటి సమావేశాలు మన జీవితానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి” అని అన్నారు.
స్నేహం, అనుబంధం, జ్ఞాపకాల విలువను మరోసారి గుర్తు చేసిన ఈ సమ్మేళనం హాజరైన ప్రతి ఒక్కరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.