Thursday, 5 February 2026
  • Home  
  • సోమిరెడ్డి చొరవతో కండలేరు ఎడమ కాలువకు జలకళ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోమిరెడ్డి చొరవతో కండలేరు ఎడమ కాలువకు జలకళ

*సోమిరెడ్డి చొరవతో… కండలేరు ఎడమ కాలువకు జలకళ..* *-స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన టిడిపి నాయకులు…* *-సోమిరెడ్డి కి ధన్యవాదాలు తెలియజేసిన రైతులు..* *పొదలకూరు:* కండలేరు జలాశయంలో నీటిమట్టం తగ్గిపోవడంతో ఎడమ కాలువలో గత కొద కొద్ది రోజులుగా నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో ఎడమ గట్టు కాలువ క్రింద సాగులో ఉన్న వరిపైర్లు, నిమ్మతోటలతో పాటు పశువులకు తాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పొదలకూరు మండల టీడీపీ నాయకులు ద్వారా రైతులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది దృష్టికి తీసుకెళ్లారు. ఎడమ కాలువ లిఫ్ట్ లో విద్యుత్ సరఫరాను అందించే ట్రాన్స్ ఫార్మర్ పిడుగుపాటుకు గురవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్యను ఇటీవల డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో కలెక్టర్ ఆనంద్ స్పందించి నిధులు మంజూరు చేశారు. దీంతో సోమిరెడ్డి ఆదేశాలతో అధికారులు యుద్ధప్రాతిపదికన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడంతో పాటు మోటార్లకు సర్వీస్ చేయడం తోపాటు ఆదివారం మండల టీడీపీ నాయకులతో కలిసి అధికారులు ఎడమ కాలువకు లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో ఎడమ కాలువకు నీరు విడుదల చేయించి పంటలు కాపాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఈ ప్రాంత రైతులు ధన్యవాదములు తెలిపారు. నీరు విడుదల చేసిన వారిలో ఇరిగేషన్ అధికారుల తోపాటు టీడీపీ పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జునాయుడు, నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, దేవినేని శరత్, పులిపాటి వెంకటేశ్వర్లు, ఎత్తపు వెంకట రెడ్డి, వెన్నపూస శ్రీనివాస్ రెడ్డి, మలిరెడ్డి ఓబుల రెడ్డి, రమణా రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

*సోమిరెడ్డి చొరవతో… కండలేరు ఎడమ కాలువకు జలకళ..*

*-స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన టిడిపి నాయకులు…*

*-సోమిరెడ్డి కి ధన్యవాదాలు తెలియజేసిన రైతులు..*

*పొదలకూరు:* కండలేరు జలాశయంలో నీటిమట్టం తగ్గిపోవడంతో ఎడమ కాలువలో గత కొద కొద్ది రోజులుగా నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో ఎడమ గట్టు కాలువ క్రింద సాగులో ఉన్న వరిపైర్లు, నిమ్మతోటలతో పాటు పశువులకు తాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పొదలకూరు మండల టీడీపీ నాయకులు ద్వారా రైతులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది దృష్టికి తీసుకెళ్లారు. ఎడమ కాలువ లిఫ్ట్ లో విద్యుత్ సరఫరాను అందించే ట్రాన్స్ ఫార్మర్ పిడుగుపాటుకు గురవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్యను ఇటీవల డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో
కలెక్టర్ ఆనంద్ స్పందించి నిధులు మంజూరు చేశారు. దీంతో సోమిరెడ్డి ఆదేశాలతో అధికారులు యుద్ధప్రాతిపదికన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడంతో పాటు మోటార్లకు సర్వీస్ చేయడం తోపాటు ఆదివారం మండల టీడీపీ నాయకులతో కలిసి అధికారులు ఎడమ కాలువకు లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో ఎడమ కాలువకు నీరు విడుదల చేయించి పంటలు కాపాడిన
ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఈ ప్రాంత రైతులు ధన్యవాదములు తెలిపారు. నీరు విడుదల చేసిన వారిలో ఇరిగేషన్ అధికారుల తోపాటు టీడీపీ పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జునాయుడు, నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, దేవినేని శరత్, పులిపాటి వెంకటేశ్వర్లు, ఎత్తపు వెంకట రెడ్డి, వెన్నపూస శ్రీనివాస్ రెడ్డి, మలిరెడ్డి ఓబుల రెడ్డి, రమణా రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.