Thursday, 5 February 2026
  • Home  
  • సుర్దేపల్లి స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్
- ఖమ్మం

సుర్దేపల్లి స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్

*సుర్దేపల్లి స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్* —————————– ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్ధేపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ, ప్రస్తుతం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న టి. లక్ష్మణ్ రావ ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. టి. లక్ష్మణ్‌రావు, తన హెడ్‌క్వార్టర్‌ వదిలి కొణిజర్ల సమీపంలోని క్రాకర్స్‌ దుకాణానికి వెళ్లి, ఇతరులతో కలిసి వాగ్వివాదం చేయటంతో పాటు, అసభ్యపదజాలంతో దూషించి, సీసీ టివి కెమెరాలను ధ్వంసం చేసిన ఆరోపణలపై, కొణిజర్ల పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయినట్లు జిల్లా విద్యాధికారి చెప్పారు. తెలంగాణ సివిల్‌ సర్వీస్‌ కండక్ట్ రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించినందుకు, తన చట్టబద్ధమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, శాఖ ప్రతిష్టను భంగపరిచే చర్యలకై సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో జిల్లా విద్యాధికారి పేర్కొన్నారు.

*సుర్దేపల్లి స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్*
—————————–
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్ధేపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ, ప్రస్తుతం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న టి. లక్ష్మణ్ రావ ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. టి. లక్ష్మణ్‌రావు, తన హెడ్‌క్వార్టర్‌ వదిలి కొణిజర్ల సమీపంలోని క్రాకర్స్‌ దుకాణానికి వెళ్లి, ఇతరులతో కలిసి వాగ్వివాదం చేయటంతో పాటు, అసభ్యపదజాలంతో దూషించి, సీసీ టివి కెమెరాలను ధ్వంసం చేసిన ఆరోపణలపై, కొణిజర్ల పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయినట్లు జిల్లా విద్యాధికారి చెప్పారు. తెలంగాణ సివిల్‌ సర్వీస్‌ కండక్ట్ రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించినందుకు, తన చట్టబద్ధమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, శాఖ ప్రతిష్టను భంగపరిచే చర్యలకై సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో జిల్లా విద్యాధికారి పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.