Thursday, 5 February 2026
  • Home  
  • సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై లాయర్ రాకేష్ కిషోర్ బూట్ విసిరి దాడికి పూనుకోవడం హేయమైన చర్య. ఈ దుశ్చర్యను ఖండించిన నంద్యాల ముస్లిం జేఏసి
- Blog

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై లాయర్ రాకేష్ కిషోర్ బూట్ విసిరి దాడికి పూనుకోవడం హేయమైన చర్య. ఈ దుశ్చర్యను ఖండించిన నంద్యాల ముస్లిం జేఏసి

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై లాయర్ రాకేష్ కిషోర్ బూట్ విసిరి దాడికి పూనుకోవడం హేయమైన చర్య. ఈ దుశ్చర్యను ఖండించిన నంద్యాల ముస్లిం జేఏసి* నిన్ను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సాక్షి గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై మత చాందస న్యాయవాది వివక్ష కోల్పోయి బూటుతో దాడి చేయడం న్యాయవ్యవస్థ పై దాడి అని, కేంద్రంలోని బీజేపి ప్రభుత్వ అలసత్వం, మతతత్వం దేశవ్యాప్తంగా ఇలాంటి దుశ్చర్యలకు నాంది కావడం విచారకరం అని సీజే గవాయ్ పై దాడిని నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. కమిటి కో కన్వీనర్ మస్తాన్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో జేఎసి గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమద్ (జమాఆతె ఇస్లామి), బాబా ఫకృద్దీన్ (ఇన్సాఫ్), ఎజాజ్ హుసేన్ (ఎస్డిపిఐ) మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై దాడీని ప్రజాస్వామ్య లౌకిక ప్రియులు ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ఇలాంటి చర్యలు మన దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నాయని , ఈ దూకుడుకు దేశం మీద గౌరవం లేని వ్యవస్థలో పోషించబడే వ్యక్తులే కారణం అన్నారు. అత్యున్నత వ్యవస్థ అధిపతులైనా దేశాధ్యక్షులు, ప్రధాన న్యాయమూర్తి ఎస్.సి లని వారి స్థాయి దిగజార్చే ప్రయత్నం సర్వ సాధారణం అయిపోయింది, అదే ఓ ముస్లిం చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అని జేఎసి నాయకులు దేశ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసారు. ఇలాంటి మత చాందస్తం ప్రమాదకరమైనది ఇలాంటి సంఘటనలు దేశ ప్రేమికులకు, మేధావులకు ఆందోళన కలిగిస్తున్నాయని ముస్లిం జేఎసి ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన దాడి సంఘటనను తీవ్రంగా ఖండించింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై లాయర్ రాకేష్ కిషోర్ బూట్ విసిరి దాడికి పూనుకోవడం హేయమైన చర్య. ఈ దుశ్చర్యను ఖండించిన నంద్యాల ముస్లిం జేఏసి*
నిన్ను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సాక్షి గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై మత చాందస న్యాయవాది వివక్ష కోల్పోయి బూటుతో దాడి చేయడం న్యాయవ్యవస్థ పై దాడి అని, కేంద్రంలోని బీజేపి ప్రభుత్వ అలసత్వం, మతతత్వం దేశవ్యాప్తంగా ఇలాంటి దుశ్చర్యలకు నాంది కావడం విచారకరం అని సీజే గవాయ్ పై దాడిని నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. కమిటి కో కన్వీనర్ మస్తాన్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో జేఎసి గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమద్ (జమాఆతె ఇస్లామి), బాబా ఫకృద్దీన్ (ఇన్సాఫ్), ఎజాజ్ హుసేన్ (ఎస్డిపిఐ) మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై దాడీని ప్రజాస్వామ్య లౌకిక ప్రియులు ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ఇలాంటి చర్యలు మన దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నాయని , ఈ దూకుడుకు దేశం మీద గౌరవం లేని వ్యవస్థలో పోషించబడే వ్యక్తులే కారణం అన్నారు. అత్యున్నత వ్యవస్థ అధిపతులైనా దేశాధ్యక్షులు, ప్రధాన న్యాయమూర్తి ఎస్.సి లని వారి స్థాయి దిగజార్చే ప్రయత్నం సర్వ సాధారణం అయిపోయింది, అదే ఓ ముస్లిం చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అని జేఎసి నాయకులు దేశ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసారు. ఇలాంటి మత చాందస్తం ప్రమాదకరమైనది ఇలాంటి సంఘటనలు దేశ ప్రేమికులకు, మేధావులకు ఆందోళన కలిగిస్తున్నాయని ముస్లిం జేఎసి ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన దాడి సంఘటనను తీవ్రంగా ఖండించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.