
పొందూరు మండలం, బురిడీకంచారం గ్రామానికి చెందిన గండి.రమణ గత 15 సంవత్సరాలుగ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వారంలో 3 రోజులు డయాలిసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండగా, వారానికి సుమారు 20 వేల రూపాయిలు ఖర్చు అవుతుంది. తండ్రి వ్యవసాయ దినసరి కూలీ కాగా, తల్లి మరణించారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా డయాలిసిస్ చేసుకునే స్థితిలో లేరని, చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతూ దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారన్న విషయం తెలుసుకున్న సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు, అతని ఆర్థిక, కుటుంబ పరిస్థితి తెలుసుకొని, దాతలు, మిత్రుల సహకారంతో ఈ రోజు 10 వేల రూపాయలను బాధితునికి డయాలసిస్ అనంతరం వైద్యశాల ప్రాంగణంలో అందజేశారు.
ఈ సందర్భంగా సంస్థ సభ్యులు హఠకేసం మాట్లాడుతూ నిస్సహాయ స్థితుల్లో ఉన్న ఈ కుటుంబాన్ని దాతలుగాని, స్వచ్ఛంద సంస్థలు గాని ముందుకు వచ్చి సహాయమందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు, సేవకులు ఉర్లం. శివతేజ పట్నాయక్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

