సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో పోలిస్ శాఖ ఆధ్వర్యంలో 2 కె రన్ నిర్వహించడం జరిగింది. ఈ రన్ కార్యక్రమాన్ని డిఎస్పీ నరసింహ మూర్తి జెండా ఊపి ప్రారంభించారు.ముందుగా అందరి దగ్గర ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి దేశం మొత్తానికి చాలా ప్రత్యేకమైన సందర్భం.సర్దార్ పటేల్ ఆధునిక కాలంలో దేశంలో ని గొప్ప వ్యక్తులలో ఒకరు.పరిశుభ్రత మరియు సుపరిపాలనకు ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.దేశ ఐక్యత మరియు సమగ్రత కోసం ఆయన ఎంతో కృషి చేశారని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న ఐక్యత పరుగులో భాగంగా శ్రీకాళహస్తిలో 2 కె రన్ నిర్వహించడం జరిగిందన్నారు.యువత డ్రక్స్ కు దూరంగా ఉండాలని అన్నారు.సైబర్ నేరాలను ఎదుర్కోవడం లో ప్రజలకు అండగా ఉంటామని అన్నారు. ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని వారన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు,విద్యార్థులు,ప్రజలు,యువత పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి లో ఐక్యతా పరుగు