విద్యార్థులు తప్పిన ప్రమాదం
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
ప్రైవేట్ పాఠశాల బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం ఈదర నుండి విద్యార్థులు ఎక్కించుకుని ఆగిరిపల్లి వస్తున్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్ బస్సు ఈదర అడ్డరోడ్డు వద్దకు రాగానే డ్రైవర్ కు ఉన్నట్టుండి ఫిట్స్ రావడంతో బస్సును అదుపు చేయలేక పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకుపోయింది. గ్రామస్తులు హుటా హుటీనా వచ్చి విద్యార్థులు బయటకు తీశారు. బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది విద్యార్థులు కు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు. నెల రోజుల్లోపు ఇదే పాఠశాలకు చెందిన బస్సులు రెండుసార్లు ప్రమాదాలకు గురికావడం గమనార్హం. ఈ సందర్భంగా ఎంఈఓ-1 హేబేలు మాట్లాడుతూ స్కూల్ బస్ ప్రమాదానికి గల కారణాలను విచారించి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.

విద్యార్థులు తప్పిన ప్రమాదం
విద్యార్థులు తప్పిన ప్రమాదం ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి ప్రైవేట్ పాఠశాల బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం ఈదర నుండి విద్యార్థులు ఎక్కించుకుని ఆగిరిపల్లి వస్తున్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్ బస్సు ఈదర అడ్డరోడ్డు వద్దకు రాగానే డ్రైవర్ కు ఉన్నట్టుండి ఫిట్స్ రావడంతో బస్సును అదుపు చేయలేక పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకుపోయింది. గ్రామస్తులు హుటా హుటీనా వచ్చి విద్యార్థులు బయటకు తీశారు. బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది విద్యార్థులు కు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు. నెల రోజుల్లోపు ఇదే పాఠశాలకు చెందిన బస్సులు రెండుసార్లు ప్రమాదాలకు గురికావడం గమనార్హం. ఈ సందర్భంగా ఎంఈఓ-1 హేబేలు మాట్లాడుతూ స్కూల్ బస్ ప్రమాదానికి గల కారణాలను విచారించి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.

