చిట్వేల్, డిసెంబర్ 15 పున్నమి ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ అధ్యక్షులు మల్లెం హేమంత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
భోజన నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించిన హేమంత్ కుమార్, పిల్లలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే అందిస్తున్న భోజనం ఎంతో రుచికరంగా, నాణ్యతతో ఉందని ప్రశంసించారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు పోషకాహారం అందడంతో పాటు విద్యపై ఆసక్తి పెరుగుతోందని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆరోగ్యం, హాజరు మెరుగుపడేందుకు ఎంతగానో దోహదపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.


