జనగామ జూలై16పున్నమి ప్రతినిధి
వికలాంగులకు 6వేలు,వృద్ధులు, వితంతువుల చేయూత పెన్షన్ 4వేల రూపాయలకు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జనగామ జిల్లా
అధ్యక్షుడు గడ్డం సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో వీహెచ్పిఎస్,ఎమ్మార్పీఎస్ సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెన్షన్ పై ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలన్నారు.


