జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘మహిళ’ పద అక్షరములలోని విశ్లేషణాత్మక భావన ఈ కవిత
*వ* వయస్సు ఆధారంగా తన ఉనికిని ఉన్నతం చేసుకుంటూ…
*ని* నిరంతరం తరంతరం కొనసాగిస్తూ…
*త* తను లేనిదే జీవనం నిర్జీవం అని మానవజాతి తలచే దేవత వనిత.
*మ* మనిషి పుట్టుకకు మనుగడకు మూలం
*హి* హితోక్తుల భావజాలానికి బలం
*ళ* కళాత్మక రూపాలను తీర్చిదిద్దే కలం
అసలు సృష్టికే మూలం మహిళ



