కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండల పరిధిలోని వంజిరి గ్రామం మరియు బరేవాడలో ఎమ్మెల్సీ దండే విఠల్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు వివిధ సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువస్తే, ఆయన సానుకూలంగా స్పందిస్తూ వీలైన పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.తరువాత ఎమ్మెల్సీ దండే విఠల్ బుద్ధ విహార్‌లో మరియు పూలాజీ బాబా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వంజిరి గ్రామస్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వంజిరి, బరేవాడలో ఎమ్మెల్సీ దండే విఠల్ పర్యటన