కామారెడ్డి, 13 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రామారెడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన సదస్సు సఫలంగా ముగి సింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామా రెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి ని స్థానికు లు ఘనంగా సన్మానించారు.స్థానిక SI రాజశేఖర్ మార్గదర్శకత్వంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు పాల్గొన్నారు. రోడ్డు నియమాల పాటించడం, హెల్మెట్ ధరించడం, వేగ పరిమితి పాటించడం వంటి అంశాలపై అడిష నల్ ఎస్పీ వివరించారు.ప్రతి రోడ్డు ప్రమాదం ఒక కుటుంబ దుఃఖానికి కారణం. అవగాహనే ఏకైక మార్గం అని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ గ్రామ పెద్దలు అడి షనల్ ఎస్పీ లను శాలువతో ఘనంగా సత్కరిం చారు.రామారెడ్డి ప్రాంతంలో రోడ్డు భద్రతను మరిం త పెంచేందుకు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమా లు నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్ ఉప సర్పంచ్ నవీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వా హకులు, తదితరులు పాల్గొన్నారు.


