రైల్వే కోడూరు, సెప్టెంబర్, (పున్నమి ప్రతినిధి)
రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ కమీషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు 10వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించి, ఆయుర్వేదం ప్రాచీన వైద్య పద్ధతి, మానవ ఆరోగ్యానికి ఉపయోగకరమని తెలియజేశారు. వృక్షశాస్త్ర ఉపన్యాసకుడు డాక్టర్ కె. రమేష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, రసాయనశాస్త్ర ఉపన్యాసకుడు కె. పి. కృష్ణమూర్తి వన మూలికల, రోగనిరోధక శక్తి, ఆయుర్వేద ప్రయోజనాలపై వివరణ ఇచ్చారు. ఎన్.యస్.యస్. కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, అధ్యాపకులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని అవగాహన పెంపొందించారు.


