Monday, 23 March 2026
  • Home  
  • రాష్ట్ర కన్వీనర్ గా డేరంగుల శేఖర్
- నాగర్‌కర్నూల్

రాష్ట్ర కన్వీనర్ గా డేరంగుల శేఖర్

రాష్ట్ర కన్వీనర్ గా డేరంగుల శేఖర్ చారకొండ:- జనవరి 05, కాంగ్రెస్ పార్టీ (న్యాయ,మానవ హక్కుల,సమాచార హక్కు)లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా చంద్రయాన్ పల్లి గ్రామానికి చెందిన న్యాయవాది డేరంగుల శేఖర్ ను నియమిస్తూ పిసిసి లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా డేరంగుల శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా చురుకైన పాత్ర చేపట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయవాద వృత్తిలో పట్టా పొంది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేసిన సేవలను గుర్తించి తనను కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తన నియమాకానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి,ఎంపి మల్లురవి,కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. *అభినందించిన వంశీచంద్ రెడ్డి* కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన డేరంగుల శేఖర్ సోమవారం సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా శేఖర్ ను శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతీలాల్ నాయక్,కిసాన్ సెల్ తాలూకా అధ్యక్షులు పర్వత్ రెడ్డి,యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పుస్తకాల రాహుల్, తక్కళ్ళపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర కన్వీనర్ గా డేరంగుల శేఖర్

చారకొండ:- జనవరి 05,

కాంగ్రెస్ పార్టీ (న్యాయ,మానవ హక్కుల,సమాచార హక్కు)లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా చంద్రయాన్ పల్లి గ్రామానికి చెందిన న్యాయవాది డేరంగుల శేఖర్ ను నియమిస్తూ పిసిసి లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ సందర్భంగా డేరంగుల శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా చురుకైన పాత్ర చేపట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయవాద వృత్తిలో పట్టా పొంది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేసిన సేవలను గుర్తించి తనను కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమించారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా తన నియమాకానికి సహకరించిన
స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి,ఎంపి మల్లురవి,కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
*అభినందించిన వంశీచంద్ రెడ్డి*
కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన డేరంగుల శేఖర్ సోమవారం సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా శేఖర్ ను శాలువా కప్పి అభినందించారు.
ఈ కార్యక్రమంలో వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతీలాల్ నాయక్,కిసాన్ సెల్ తాలూకా అధ్యక్షులు పర్వత్ రెడ్డి,యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పుస్తకాల రాహుల్, తక్కళ్ళపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.