Tuesday, 24 March 2026
  • Home  
  • రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధనే ధ్యేయం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధనే ధ్యేయం

“* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తో సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి చర్చించిన పలు జిల్లాల పార్టీ అధ్యక్షులు, కాకాణి గోవర్ధన్ రెడ్డి అనంత వెంకట్రామిరెడ్డి , కాటసాని రాంభూపాల్ రెడ్డి గమ భూమన కరుణాకర్ రెడ్డి , అమర్నాథ్ రెడ్డి , రవీంద్రనాథ్ రెడ్డి , ఉష శ్రీ చరణ్ తోపాటు శైలజనాథ్ సతీష్ కుమార్ రెడ్డి , లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి , పుట్టా శివ శంకర్ పలువురు రైతు సంఘాల నాయకులు, తదితరులు రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా ఉద్యమించాలని నిర్ణయించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం దాదాపు పూర్తికా వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మోకాలు అడ్డడం అన్యాయం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు విని చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి తీరని ద్రోహం తలపెట్టారని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రం ఒక పక్క ఆల్మట్టి ఎత్తు పెంచుతూ నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఆంధ్రా ప్రాంతానికి తీవ్రమైన సాగునీటి కొరత రాబోతుందని తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం జలాశయం నుండి 800 అడుగుల దిగువ భాగం నుండే రోజుకు 8 టీఎంసీల నీరు తరలించుకుపోతుందని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శ్రీశైలం జలాశయాన్ని నిబంధనలు అతిక్రమించి వినియోగించుకునే విధంగా గతంలో తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మించగా చంద్రబాబు తిరిగి 2024 లో ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి మాటలు విని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అట్టెకెక్కించేశారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క ప్రాధాన్యతను రైతులకు, ప్రజలకు వివరించి, ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో జిల్లాస్థాయి, నియోజకవర్గస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని, రైతాంగానికి సాగునీటి కోసం, ప్రజానీకానికి త్రాగు నీటి కోసం, ఉత్పన్నం కానున్న కష్ట,నష్టాల గురించి వివరించాలని నిర్ణయించారు. రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు, కలిసి వచ్చే అన్ని పార్టీలు, స్వచ్ఛంద సేవ సంస్థలు, పౌరహక్కుల నేతలు, రైతు సంఘం నాయకులు, అందరితో కలిసి ఉద్యమిస్తూ రాయలసీమ ఎత్తిపోతల సాధనే ధ్యేయంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, తిరిగి ప్రారంభించే వరకు పోరాడుదాం అని పిలుపునిచ్చారు. చంద్రబాబు మెడలు వంచైనా, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించి ,రాయలసీమ ప్రాంతం తో పాటు, నెల్లూరు, దక్షిణ ప్రకాశం ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీరు, అందించేందుకు సన్నద్ధం కావాలని నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి రోజుకు రెండు టీఎంసీల చొప్పున రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లిఫ్ట్ ద్వారా నీరందించాలనే లక్ష్యంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శ్రీకారం చుట్టగా అది పూర్తవుతున్న పరిస్థితుల్లో జగన్ కు మంచి పేరు వస్తుందని, రైతుల ప్రయోజనాలు విస్మరించి, చంద్రబాబు, రేవంత్ రెడ్డి మాటలు విని అర్ధాంతరంగా ఆపివేయడం దుర్మార్గంగా సమావేశం లో నిర్ణయించారని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. –

“*
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తో సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి చర్చించిన పలు జిల్లాల పార్టీ అధ్యక్షులు, కాకాణి గోవర్ధన్ రెడ్డి అనంత వెంకట్రామిరెడ్డి , కాటసాని రాంభూపాల్ రెడ్డి గమ భూమన కరుణాకర్ రెడ్డి , అమర్నాథ్ రెడ్డి , రవీంద్రనాథ్ రెడ్డి , ఉష శ్రీ చరణ్ తోపాటు శైలజనాథ్ సతీష్ కుమార్ రెడ్డి , లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి , పుట్టా శివ శంకర్ పలువురు రైతు సంఘాల నాయకులు, తదితరులు
రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా ఉద్యమించాలని నిర్ణయించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం దాదాపు పూర్తికా వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మోకాలు అడ్డడం అన్యాయం అని
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు విని చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి తీరని ద్రోహం తలపెట్టారని ఆరోపించారు.
కర్ణాటక రాష్ట్రం ఒక పక్క ఆల్మట్టి ఎత్తు పెంచుతూ నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఆంధ్రా ప్రాంతానికి తీవ్రమైన సాగునీటి కొరత రాబోతుందని
తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం జలాశయం నుండి 800 అడుగుల దిగువ భాగం నుండే రోజుకు 8 టీఎంసీల నీరు తరలించుకుపోతుందని విమర్శించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శ్రీశైలం జలాశయాన్ని నిబంధనలు అతిక్రమించి వినియోగించుకునే విధంగా గతంలో తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మించగా చంద్రబాబు తిరిగి 2024 లో ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి మాటలు విని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అట్టెకెక్కించేశారని ఆరోపించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క ప్రాధాన్యతను రైతులకు, ప్రజలకు వివరించి, ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో జిల్లాస్థాయి, నియోజకవర్గస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని, రైతాంగానికి సాగునీటి కోసం, ప్రజానీకానికి త్రాగు నీటి కోసం, ఉత్పన్నం కానున్న కష్ట,నష్టాల గురించి వివరించాలని నిర్ణయించారు.
రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు, కలిసి వచ్చే అన్ని పార్టీలు, స్వచ్ఛంద సేవ సంస్థలు, పౌరహక్కుల నేతలు, రైతు సంఘం నాయకులు, అందరితో కలిసి ఉద్యమిస్తూ
రాయలసీమ ఎత్తిపోతల సాధనే ధ్యేయంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, తిరిగి ప్రారంభించే వరకు పోరాడుదాం అని పిలుపునిచ్చారు.
చంద్రబాబు మెడలు వంచైనా, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించి ,రాయలసీమ ప్రాంతం తో పాటు, నెల్లూరు, దక్షిణ ప్రకాశం ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీరు, అందించేందుకు సన్నద్ధం కావాలని నిర్ణయించారు.
జగన్మోహన్ రెడ్డి రోజుకు రెండు టీఎంసీల చొప్పున రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లిఫ్ట్ ద్వారా నీరందించాలనే లక్ష్యంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శ్రీకారం చుట్టగా
అది పూర్తవుతున్న పరిస్థితుల్లో జగన్ కు మంచి పేరు వస్తుందని, రైతుల ప్రయోజనాలు విస్మరించి, చంద్రబాబు, రేవంత్ రెడ్డి మాటలు విని అర్ధాంతరంగా ఆపివేయడం దుర్మార్గంగా సమావేశం లో నిర్ణయించారని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.