పున్నమి ప్రతినిధి:
*రాయదుర్గంలో ఎకరం ధర రూ. 177 కోట్లు – వేలంలో టీజీఐఐసీపై కాసుల వర్షం*
*టీజీఐఐసీ వేలంలో రికార్డు ధర – 18 ఎకరాల భూమిని వేలం వేసిన టీజీఐఐసీ – రూ. 177 కోట్లకు ఎకరం చొప్పున 7.67 ఎకరాల భూమిని దక్కించుకున్న ఎంఎస్ఎన్ రియాల్టీ*
రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్రభుత్వ భూముల వేలానికి ఊహించని స్పందన లభించింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం ధర రూ.177 కోట్లు పలికి రికార్డు నెలకొల్పింది. ఈ ప్రాంతంలో ఉన్న 18 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని టీజీఐఐసీ వేలం వేసింది. దీంట్లో పాల్గొన్న ఎంఎస్‌ఎన్ రియాలిటీ సంస్థ అత్యధిక ధరతో 7.6 ఎకరాల భూమిని వేలంలో సొంతం చేసుకుంది. ఒక్క ఎకరానికి రూ.177 కోట్ల చొప్పున మొత్తం రూ.1357 కోట్లకు చేజిక్కించుకుంది. మరో 11 ఎకరాలకు వేలం ప్రక్రియ కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసి) నిర్వహించిన రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూముల వేలం పాటలో ఎకరా భూమికి ఏకంగా రూ. 177 కోట్లు చెల్లించి ఎంఎస్ఎన్ రియాల్టీ ఈ భూములను సొంతం చేసుకుంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ (సర్వే నంబరు 83/1)లోని మొత్తం 18.67 ఎకరాల్లో భాగంగా ఉన్న 7.67 ఎకరాలను ప్రభుత్వం టీఎస్‌ఐఐసీ ద్వారా వేలం వేసింది.
హోరా హోరీగా పోటీ :
రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, టీజీఐఐసీ ఈ వేలం కోసం ఎకరాకు రూ. 101 కోట్లుగా ప్రారంభ ధరను నిర్ణయించింది. ఈ వేలంలో ఎంఎస్ఎన్, హెటెరో, మేఘా, బ్రిగేడ్ గ్రూప్, సత్వ, ప్రెస్టీజ్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థలు హోరా హోరీగా పోటీ పడ్డాయి. ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ఈ వేలంలో ఎంఎస్ఎన్ రియాల్టీ ఒక్క ఎకరా భూమిని రూ. 177 కోట్లకు దక్కించుకోవడం ద్వారా రికార్డు సృష్టించింది.
ఈ ధరతో మొత్తం 7.67 ఎకరాలను ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ఏకంగా రూ.1,357 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ రికార్డు స్థాయి ధర, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలాన్ని, ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాలకు సమీపంలో ఉన్న రాయదుర్గం ఏరియా ప్రాముఖ్యతను మరోసారి చాటి చెప్పింది.
అత్యంత ఖరీదైన ప్రాంతంగా నాలెడ్జ్ సిటీ :
మొత్తం 18 ఎకరాల ప్రభుత్వ భూమికి టీజీఐఐసీ వేలం నిర్వహిస్తోంది. మరో 11 ఎకరాల భూమికి వేలం కొనసాగుతోంది. 2017లో ఇదే ప్రాంతంలో ఎకరం ధర రూ. 42.59 కోట్లు పలికింది. ఎనిమిదేళ్లలోనే వ్యవధిలోనే రాయదుర్గంలో ఎకరం ధర రూ. 177 కోట్లు పలికింది. 2022లో నియోపోలీస్, కోకాపేట్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వేలం వేసిన భూమికి రూ. 100 కోట్ల ధర లభించింది. కోకాపేట, నియోపోలీస్ భూములతో పోలిస్తే ఇప్పుడు రాయదుర్గంలో 75 శాతం ధర ఎక్కువగా ఉంది. 7.67 ఎకరాలు, 11 ఎకరాలను రెండు భాగాలుగా చేసి టీజీఐఐసీ వేలం వేస్తోంది.చదరపు గజానికి రికార్డు ధర : తెలంగాణ హౌజింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లో మరోసారి రికార్డు స్థాయి ధర లభించింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్లో చదరపు గజం రూ.1.14 లక్షలు పలికింది. తెలంగాణ హౌజింగ్ బోర్డు 18 ఓపెన్ ప్లాట్లు, 4 ఫ్లాట్లను బహిరంగ వేలం వేసింది. దీనిలో 27 మంది బిడ్డర్లు పోటాపోటీగా పాల్గొన్నారు.


