పున్నమి ప్రతి నిధి
ఖమ్మం నగరము లోని 2 వ పట్టణ పరిధిలో గల అన్ని డివిజన్ లలో బీజేపీ గెలుపు లక్ష్యం గా ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో
డివిజన్ ల పర్యటన కార్యక్రమం చేపట్టడం జరిగింది
5వ రోజు పర్యటనలో భాగంగా 52వ డివిజన్‌లోని పోలింగ్ బూత్‌లు 186, 187, 188 అధ్యక్షులను కలిసి డివిజన్ సమస్యలను తెలుసుకున్నారు.
ఖమ్మం డిపో రోడ్‌లో స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలియజేశారు. ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించేందుకు త్వరలో బీజేపీ టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌ను కలిసి చర్యలు తీసుకుంటామని వెంకటనారాయణ హామీ ఇచ్చారు.
దాసరి మధు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఖమ్మం బీజేపీ సీనియర్ నాయకులు వేల్పుల సుధాకర్, ఈశ్వరప్రగడ రామారావు, బోయల వెంకట్, చిన్నికృష్ణ, టూ టౌన్ ప్రధాన కార్యదర్శి జ్యోతుల యుగంధర్ నాయుడు, టూ టౌన్ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాసరెడ్డి, ఇనుగుర్తి ఉపేంద్ర, ట్రెజరర్ దాసరి వీరభద్రం, నాయకులు చందు, సుభాష్, మాధవి, సాయి, సునీత తదితరులు పాల్గొన్నారు.


