చిట్వేల్, సెప్టెంబర్ 26 (మీ స్పందన)
చిట్వేలు మండలం రాజుకుంటకు చెందిన ముగ్గురు ప్రముఖ యువ నాయకులు శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం విజయవాడలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ కొనిదల నాగబాబు, రాజకీయ కార్యదర్శి, పార్టీ విప్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలో జరిగింది.రైల్వే కోడూరు సీనియర్ నాయకులు తాతం శెట్టి నాగేంద్ర, జోగినేని మణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజుకుంటకు చెందిన యువనాయకులు ఆనాల సునీల్ కుమార్, మాజీ సర్పంచ్ మాదినేని కనకరాజు, మాదినేని లోకేష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలో చేరారు.ఈ పరిణామంతో మండలంలో జనసేనకు కొత్త ఊపుని తెచ్చిందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


