మొంథా తుఫాన్ ధాటికి విద్యుత్ ట్రాన్స్ఫర్మర్ లు నేలమట్టం
ఖమ్మం జిల్లా
(పున్నమి ప్రతినిధి )అక్టోబర్ 30
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ భీభత్సం సృష్టిస్తుంది. అత్యధిక వర్షంతో పాటు, గంటకు 60 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఎదురుగాలులకు విద్యుత్ ట్రాన్స్ఫర్మార్ లు సైతం ఎగిరి పడ్డాయి. ఏన్కూర్ మండల పరిధిలోని హిమామ్ నగర్ గ్రామంలో రెండు చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫర్మర్ లు బీభత్సం ఈదురు గాలులకు ఎగిరి పడిపోగా, స్థంభాల మీద విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్థంబాలు పడ్డాయి.
ఏన్కూర్ మండలం విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం ఫీల్డ్ లో తిరుగుతూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నిరంతరం వర్షంలోనే విధులను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది మండల ప్రజలు వారిని అభినందించడం జరిగింది


