మేడిపల్లి నక్కర్త గ్రామంలో పురాతన శివాలయంను పునః ప్రారంభం
పున్నమి న్యూస్ ప్రతినిధి
14 ఫిబ్రవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
ఇంచార్జ్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని
మేడిపల్లి నక్కర్త గ్రామంలో పురాతన శివాలయంను పునః ప్రారంభించాలని ఉద్దేశంతో గ్రామంలో శివాలయాన్ని భక్తుల, గ్రామస్తుల కోరిక మేరకు గత వారం రోజుల క్రితం సర్వే నిమిత్తం (ఎం ర్ ఓ )కి శివాలయ భూమిని గుడికి మాత్రమే చెందాలని ఉద్దేశంతో “సర్పంచ్ ముచ్చర్ల సుగుణ సంపత్” ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యుల నిర్ణయ మేరకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.నిన్న గ్రామ సర్పంచ్ వెంటనే గుడిని సందర్శి రేపు జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా గ్రామంలో ఉన్న శివాలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవడానికి గ్రామస్తులందరి కోరిక మేరకు ఆ గుడిని శుభ్రం చేసి మరియు గుడి చుట్టూ ముట్టు (జేసీబీ,)సహాయంతో చెట్లు, రాళ్ళను తొలగించి మహాశివరాత్రికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పనులు మొదలుపెట్టిన గ్రామ సర్పంచ్ .ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపసర్పంచ్ దెంది మధుకర్ రెడ్డి మరియు పాల్గొన్న నూతన వార్డు సభ్యులు,మాజీ ప్రజా ప్రతినిధులకు,మాజీ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు అందరికీ ధన్యవాదములు.



