*మెడికల్ కాలేజీలు పూర్తిచేసి, ప్రభుత్వమే నిర్వహించాలి*
*38వార్డు లో కోటి సంతకాల కార్యక్రమంలో వాసుపల్లి డిమాండ్*
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- *
ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఒక చరిత్రగా విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్
అభివర్ణించారు. వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. 38వ వార్డ్ ప్రెసిడెంట్ గురజాపు రవి, వార్డ్ యూత్ ప్రెసిడెంట్ చేపల నూకరాజు (బుడ్డి ) ఆధ్వర్యంలో కుర్పమార్కెట్ దగ్గర కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వైసిపి హయాంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వల్ల వాటికి అనుబంధంగా ఉండే బోధన ఆసుపత్రులలో పేదలకు పూర్తిస్థాయిలో ఉచిత వైద్యం అందదని చెప్పారు. ఇంకా రోగనిర్ధరణ అలాగే ఇన్ పేషెంట్ మెడిసిన్స్ కి చార్జ్ చేస్తారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా మరో వైపు రాష్ట్రం పెద్ద సంఖ్యలో మెడికల్ సీట్లు కోల్పోతుందని తెలిపారు.
గత ఏడాది 750 ఎంబిబిఎస్ సీట్లు సమకూర్చాల్సి ఉన్న చంద్రబాబు ప్రభుత్వ కక్ష పూర్తి విధానాలతో 700 సీట్లు కోల్పోయామని పేర్కొన్నారు.
2025 – 26 లో 1750 సీట్లు, అలా మొత్తం 2450 మెడికల్ సీట్లు మన పిల్లలు కోల్పోతున్నారని తెలియజేశారు.
1947 నుంచి 2022 వరకు రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజ్ మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం పి పిపి పేరిట డ్రామాలు ఆడుతోందని ప్రజలకు అర్థమైందని వివరించారు.
వైయస్ జగన్ ప్రభుత్వం హయాంలోనూ 7 మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తికాగా అయిదు కాలేజీలో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి అని చెప్పారు. మరో 10 కాలేజీల నిర్మాణ పనులు వివిధ దశలలో ఉన్నట్లు వెల్లడించారు. వైయస్సార్సీపి ప్రభుత్వం దిగిపోయేసరికి వాటిలో దాదాపు రూ. 3 వేల కోట్ల విలువైన పనులు జరిగినట్లు పేర్కొన్నారు.
కొత్త మెడికల్ కాలేజీల కోసం ఏటా రూ. 1000 కోట్ల చొప్పున అయిదు ఏళ్ళు వ్యయం చేస్తే చాలని, కానీ ప్రభుత్వం ఆ దిశలో ఆలోచన చేయకుండా, పి పి పి పేరుతో ప్రైవేటీకరణ పై
ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు.
వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు కూడా పూర్తిచేసి అన్నిటిని ప్రభుత్వం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, స్టేట్ బూత్ కమిటీ సెక్రటరీ సన్యాసిరావు, సారిపిల్లి అరుణ, ఆకుల శ్యామ్,చేపల రాజు, చోడిపిళ్లి శివ,పిల్ల అప్పారావు,38వ వార్డు వైసిపి సీనియర్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


