ముస్తాబాద్ /పున్నమి ప్రతినిధి /జనవరి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మాఘ అమావాస్య పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ స్వయంభు వెంకటేశ్వర స్వామి బోరు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
ఈ పూజా కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ముస్తాబాద్ ఎస్‌ఐ గణేష్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏద్దండి నర్సింహా రెడ్డి, మొర్రాయిపల్లె ఉప సర్పంచ్ పల్లె ఆనంద్ పాల్గొన్నారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు జల బిక్షపతి, కంచం నరసింహులు, దేవరెడ్డి రంజిత్ తదితరులు హాజరై గ్రామ శాంతి, ప్రజల శ్రేయస్సు కోసం స్వామివారి ఆశీస్సులు కోరారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.


