Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Mahabubabad

మహబూబాబాద్ జిల్లా ప్రగతి ప్రస్థానం – కేసీఆర్ అనే మహానేత చలువే!

Punnami Newsroom Published:
మహబూబాబాద్ జిల్లా ప్రగతి ప్రస్థానం – కేసీఆర్ అనే మహానేత చలువే!

Story highlights

  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మహబూబాబాద్ అంటే వరంగల్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం.
  • పరిపాలన కోసం ప్రజలు 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి.
  • కానీ ఒక్క కేసీఆర్ అనే నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహబూబాబాద్ తలరాతే మారిపోయింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మహబూబాబాద్ అంటే వరంగల్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం. పరిపాలన కోసం ప్రజలు 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి. కానీ ఒక్క కేసీఆర్ అనే నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహబూబాబాద్ తలరాతే మారిపోయింది.

*11-10-2016 – మహబూబాబాద్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు.* కేసీఆర్ గారు తన మాట నిలబెట్టుకుని మహబూబాబాద్ ను జిల్లాగా ప్రకటించారు. అది కేవలం జిల్లా ఏర్పాటు కాదు, ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నిర్ణయం.

*కేసీఆర్ హయాంలో మహబూబాబాద్ కు జరిగిన అభివృద్ధి ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం:*

– *పరిపాలన ప్రజల ముంగిట్లోకి:* అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు – ఇవన్నీ కేసీఆర్ చలవే.
– *వైద్య రంగంలో విప్లవం:* మన పేద గిరిజన బిడ్డలు డాక్టర్లు కావాలని, మన ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందాలని *మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ* ని తెచ్చింది కేసీఆర్ గారే.
– *గిరిజన గుండె చప్పుడు విన్న నేత:* తెలంగాణలో గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇచ్చి, పోడు భూములకు పట్టాలు ఇచ్చి, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేసి గిరిజనులకు రాజ్యాధికారం ఇచ్చింది కేసీఆర్.
– *నీళ్లు, రోడ్లు, వెలుగులు:* కాళేశ్వరం జలాలతో మన చెరువులు నింపి, డబుల్ రోడ్లతో మండలాలను అనుసంధానం చేసి, ప్రతి తండాకు కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ దే.
– *ఆకలి తీర్చిన అన్న:* ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా – ఏ పథకం చూసినా మహబూబాబాద్ జిల్లా ప్రజల కళ్ళలో ఆనందం నింపింది కేసీఆర్ గారే.

ఈరోజు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే దానికి కారణం కేసీఆర్ గారు మనకు ఇచ్చిన జిల్లానే.

డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే *శ్రీ డీఎస్ రెడ్యా నాయక్ గారు* చెప్పినట్లు, కేసీఆర్ గారు మహబూబాబాద్ కు చేసిన మేలుకు రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెలంగాణను నిలబెట్టేది కేసీఆర్, మహబూబాబాద్ జిల్లాను మళ్ళీ ప్రగతి పథంలో నడిపించేది కూడా కేసీఆర్ గారే.

రానున్నది గులాబీ జెండా కాలమే, రానున్నది కేసీఆర్ గారి నాయకత్వమే!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *