Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Mahabubabad

మహబూబాబాద్ జిల్లా అభివృద్ధిలో కేసీఆర్‌ది కీలక పాత్ర

Punnami Newsroom Published:
మహబూబాబాద్ జిల్లా అభివృద్ధిలో కేసీఆర్‌ది కీలక పాత్ర

దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్

మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహబూబాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయడంతో పాటు, జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని డోర్నకల్ మాజీ శాసనసభ్యులు శ్రీ డీఎస్ రెడ్యా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రెడ్యా నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, గిరిజన ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత లభించిందని పేర్కొన్నారు. మహబూబాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువయ్యాయని తెలిపారు.

జిల్లా ఏర్పాటుతో పాటు మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ భవనం, ఎస్పీ కార్యాలయం, రహదారులు తదితర మౌలిక వసతుల కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందని ఆయన వివరించారు. మహబూబాబాద్ జిల్లా అభివృద్ధిలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.

గిరిజనుల సంక్షేమం, జిల్లా అభివృద్ధి అంశాలను దృష్టిలో ఉంచుకుని రానున్న ఎన్నికల్లో కెసిఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి రుణం తీర్చుకోవాలని రెడ్యా నాయక్ అన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మహబూబాబాద్ జిల్లా అభివృద్ధిలో కేసీఆర్‌ది కీలక పాత్ర

Leave a comment

Your email address will not be published. Required fields are marked *