Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: Political

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బ్రహ్మేశ్వరం సర్పంచ్‌గా కరాది విజయ ఘనవిజయం

దుత్తలూరు: మండలంలోని బ్రహ్మేశ్వరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి కరాది విజయ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 122 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొత్తపేట సర్పంచ్గా పేలపూడి మాధవి విజయం

దుత్తలూరు మండలం కొత్తపేట సర్పంచ్గా మాజీ TDP మండల కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం సతీమణి, TDP మద్దతు అభ్యర్థి పేలపూడి మాధవి 63 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో పేలపూడి వర్గీయులు సంబరాల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా పేలపూడి వెంకటరత్నం తన సతీమణి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలంలో బీజేపీ మద్దతుదారుడి విజయం

దుత్తలూరు: రాచవారిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారుడు నంబూరి రోసిరెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 35 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోమలరేగడలో YCP మద్దతుదారు విజయం

దుత్తలూరు మండలం సోమలరేగడ పంచాయతీలో YCP క్లీన్ స్వీప్ చేసింది. పంచాయతీ సర్పంచ్ YCP మద్దతు అభ్యర్థి మన్నేపల్లి లక్ష్మీదేవి 183 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పంచాయతీలోని ఎనిమిది వార్డులను YCP మద్దతు అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో పంచాయతీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. గెలుపులో కీలకంగా వ్యవహరించిన YCP నాయకులకు, కార్యకర్తలకు ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పాపంపల్లిలో శ్రీనివాసులు, బోడవారిపల్లిలో ఓబులమ్మ విజయం

దుత్తలూరు మండలం పాపంపల్లి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడు చల్ల శ్రీనివాసులు విజయం సాధించారు. తమ సమీప వైసీపీ మద్దతుదారుడిపై 36 ఓట్లతో గెలిచారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. బోడవారి పల్లి పంచాయతీలోనూ టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బంక ఓబులమ్మ13 ఓట్లతో విజయం సాధించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తెడ్డుపాడు సర్పంచ్‌గా తాళ్లూరి రత్నమ్మ ఘన విజయం!

దుత్తలూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన తాళ్లూరి రత్నమ్మ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 51 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో ఆమె మద్దతుదారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. రత్నమ్మకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. తెడ్డుపాడులో సర్పంచ్ పీఠం తాళ్లూరి రత్నమ్మ సొంతం కావడంతో మద్దతుదారుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో బోణీ కొట్టిన వైసీపీ.. 172 ఓట్ల మెజారిటీతో ఘన విజయం!

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో తొలి సర్పంచ్ ఫలితం వెలువడింది. వైసీపీ మద్దతుతో పోటీ చేసిన రామిరెడ్డి వెంకటరెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించారు. తన సమీప టీడీపీ మద్దతు అభ్యర్థి భాస్కర్ రెడ్డిపై 172 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దుత్తలూరులో తొలి విజయంతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రెడ్లదిన్నె పంచాయతీలో పోటెత్తిన ఓటర్లు.. 89.3 శాతం రికార్డు స్థాయి పోలింగ్!

Date 29-11-2026 దుత్తలూరు నందిపాడు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం రెడ్లదిన్నె గ్రామ పంచాయతీలో ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఆరు వార్డుల్లో 721 ఓట్లకు గాను 644 ఓట్లు పోలయ్యాయి. దీంతో 89.3 శాతం పోలింగ్ నమోదైంది. వార్డుల వారీగా పోలైన ఓట్ల వివరాలు: 1వ వార్డు – 100 ఓట్లు 2వ వార్డు – 106 ఓట్లు 3వ వార్డు – 109 ఓట్లు 4వ వార్డు – 110 ఓట్లు 5వ వార్డు – 112 ఓట్లు 6వ వార్డు – 107 ఓట్లు మొత్తం 721 ఓట్లకు గాను 644 ఓట్లు పోలవడంతో గ్రామంలో 89.3 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఎన్నికల సందడి నెలకొంది. పెద్ద ఎత్తున పోలింగ్ జరగడం తొ అభ్యర్థులలో ఫలితాల పై ఉత్కంట నెలకొలింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు సర్పంచ్ అభ్యర్థిగా పోతుంగుంట ప్రసాద్ నాయుడు నామినేషన్ దాఖలు

దుత్తలూరు. నందిపాడు Date:19-11-2026 దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోతుంగుంట ప్రసాద్ నాయుడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఎంపీపీ రవీంద్రబాబు, టీడీపీ దుత్తలూరు మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, మండలం బీజేవైఎం అధ్యక్షులు పేమ్మసాని వేణుగోపాల్ తొ పాటు మండల టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు ఆయనకు మద్దతుగా నిలిచారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు MPPగా రాజ్యలక్ష్మి

దుత్తలూరు ఎంపీపీ అభ్యర్థిగా మల్లంపాటి రాజ్యలక్ష్మి పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. నర్రవాడ సెగ్మెంట్ ఎంపీటీసీగా ఆమె విజయం సాధించారు. మరికాసేపట్లో ఎంపీడీవో కార్యాలయంలో నూతన ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులంతా కలిసి ఆమెను ఎంపీపీగా ఎన్నుకోనున్నారు.