ముమ్మిడివరం,జూన్ 30,పున్నమి న్యూస్ :జులై1న అనగా రేపు మంగళవారం జరగనున్న భారతీయ జనతాపార్టీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికలలో ముమ్మిడివరం మండలానికి చెందిన ఇద్దరు నాయకులకు ఓట్లు దక్కడం విశేషం.గత 30 సంవత్సరాలుగా పార్టీ లోసేవాలందిస్తూ ముమ్మిడివరం రూరల్ మండల మాజిఅధ్యక్షులు అయినటువంటి పొత్తూరి వి వి యస్ యన్ మూర్తిరాజు,ఎస్సీ మోర్చా భీమవరపు వి సూర్యారాజు లకు ఓటు హక్కు దక్కింది.దీంతో రేపుజరగబోయే ఎన్నికలో విజయవాడ నందు పాల్గొంటారు.వీరికి ఈ అవకాశం రావడంతో పలువురు వీరికి అభినందనలు తెలిపారు.