Monday, 8 December 2025
  • Home  
  • భీమిలి ప్రావీణ్యతను తెలియజేసే గాలిమేడను పునఃనిర్మించండి. ఎమ్మెల్యే గంటాను కోరిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
- విశాఖపట్నం

భీమిలి ప్రావీణ్యతను తెలియజేసే గాలిమేడను పునఃనిర్మించండి. ఎమ్మెల్యే గంటాను కోరిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

భీమిలి ప్రాంతానికి చోయగాలు పొలికించే పురాతన గాలిమేడను పునఃనిర్మించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేసారు. బుధవారం ఎంవిపిలో ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. భీమిలికి ఆధ్యాత్మిక పరంగా, సాంస్కృతిక పరంగా ఎంతో ప్రావీణ్యత ఉందని అదేవిదంగా ఆంగ్లేయుల పాలనలో భీమిలి ప్రాంతంలో కొన్ని అదునాతన కట్టడాలు నిర్మించారని అన్నారు. అందులో ఒకటి గాలిమేడ అని వివరించారు. సముద్ర తీరంలో నిర్మించిన గాలిమేడ ఎంతో చక్కని ఆహ్లాదాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే గంటాకు ఇచ్చిన వినతిపత్రంలో తెలియజేసారు. భీమిలికే వన్నె తెచ్చే విధంగా గాలిమేడ ఉండేదని అన్నారు. రోజుకు కొన్ని వేలమంది పర్యాటకులు సందర్శించేవారని అన్నారు. పదుల సంఖ్యలో సినిమా షూటింగ్స్ గాలిమేడను ఆధారంగా చేసుకొని నిర్మించారని అన్నారు. అయితే పురాతన భవనం కావడం వలన రెండు దశబ్దాల క్రితం మొత్తం పడగొట్టాల్సి వచ్చిందని అన్నారు. కానీ నాటి గాలిమేడ తీపిగుర్తులు ఇంకా స్థానికులను, పర్యాటకులను అబ్బురపర్చే విధంగా ఉన్నాయని అన్నారు. దయచేసి పాత గాలిమేడ నమూనా ఆధారంగా నూతన గాలిమేడను పునఃనిర్మించినట్లయితే పర్యాటకంగా ఇంకా భీమిలి మంచి అభివృద్ధి చెందుతుందని, పర్యాటకులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. అదేవిదంగా భీమిలి చరిత్ర ఆధారంగా గోస్తనీ నది మధ్యలో భీముని యొక్క నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి చుట్టూ పార్క్ గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి ఇచ్చిన వినతిపత్రంలో గంటా నూకరాజు కోరారు.

భీమిలి ప్రాంతానికి చోయగాలు పొలికించే పురాతన గాలిమేడను పునఃనిర్మించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేసారు.
బుధవారం ఎంవిపిలో ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. భీమిలికి ఆధ్యాత్మిక పరంగా, సాంస్కృతిక పరంగా ఎంతో ప్రావీణ్యత ఉందని అదేవిదంగా ఆంగ్లేయుల పాలనలో భీమిలి ప్రాంతంలో కొన్ని అదునాతన కట్టడాలు నిర్మించారని అన్నారు. అందులో ఒకటి గాలిమేడ అని వివరించారు. సముద్ర తీరంలో నిర్మించిన గాలిమేడ ఎంతో చక్కని ఆహ్లాదాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే గంటాకు ఇచ్చిన వినతిపత్రంలో తెలియజేసారు. భీమిలికే వన్నె తెచ్చే విధంగా గాలిమేడ ఉండేదని అన్నారు. రోజుకు కొన్ని వేలమంది పర్యాటకులు సందర్శించేవారని అన్నారు. పదుల సంఖ్యలో సినిమా షూటింగ్స్ గాలిమేడను ఆధారంగా చేసుకొని నిర్మించారని అన్నారు. అయితే పురాతన భవనం కావడం వలన రెండు దశబ్దాల క్రితం మొత్తం పడగొట్టాల్సి వచ్చిందని అన్నారు. కానీ నాటి గాలిమేడ తీపిగుర్తులు ఇంకా స్థానికులను, పర్యాటకులను అబ్బురపర్చే విధంగా ఉన్నాయని అన్నారు. దయచేసి పాత గాలిమేడ నమూనా ఆధారంగా నూతన గాలిమేడను పునఃనిర్మించినట్లయితే పర్యాటకంగా ఇంకా భీమిలి మంచి అభివృద్ధి చెందుతుందని, పర్యాటకులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. అదేవిదంగా భీమిలి చరిత్ర ఆధారంగా గోస్తనీ నది మధ్యలో భీముని యొక్క నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి చుట్టూ పార్క్ గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి ఇచ్చిన వినతిపత్రంలో గంటా నూకరాజు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.