భారతదేశ మొట్ట మొదటి ముస్లీం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 125 వ వర్ధంతి మరియు బహుజనుల ఆశాజ్యోతి మహిళల పక్షపాతి, అలుపెరుగని పోరాట యోధుడు మాన్యశ్రీ కాన్షీరామ్ 19 వ వర్ధంతి సందర్భంగా యస్సీ యస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావుపూలే భార్య సావిత్రిబాయి పూలే తో పాటు దళిత బాలికలకు,మహిళలకు విద్యను అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన భారతదేశ మొట్ట మొదటి ముస్లీం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ సేవలు చిరస్మరణీయం అని ఆమె అన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ మాట్లాడుతూ *కులాన్ని నిర్మూలిద్దాం బహుజన సమాజాన్ని నిర్మిద్దాం నినాదంతో దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టి బహుజనుల గొంతుకైన పోరాట యోధులు మాన్యశ్రీ కాన్షీరామ్ అని ఆమె అన్నారు. రాజ్యాధికారం కోసం కృషి చేసి దళిత మహిళను ముఖ్యమంత్రి ని చేసిన మహనీయులు బహుజనుల ఆశాజ్యోతి కాన్షీరామ్ అని ఆమె అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వదిలి వెళ్ళిన బాధ్యతలను కాన్షీరామ్ తన భుజాన వేసుకొని బహుజన రాజ్యాధికారం కోసం అంబేద్కర్ చెప్పిన మాస్టర్ కీ* రుచిని బహుజనులకు చూపించినది మాత్రం కాన్షీరామ్ అని ఆమె అన్నారు. బహుజనులపై దాడులు,అత్యాచారాలు, వివక్షత పోవాలంటే మనం రాజ్యాధికారం చేపట్టాలని చెప్పిన బహుజన మేధావి మాన్యశ్రీ కాన్షీరామ్ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాలెం రాధ, కటికె భాను, ఈరమ్మ , ఆకుతోట పద్మావతి ,ఖాసీంబి, రేవతి , షేకున్ బీ, కొమ్ము పెద్దక్క, ఖాజాబీ రంగమ్మ , లక్ష్మీ, కళావతి, అమీనా తదితరులు పాల్గొన్నారు

భారతదేశ మొట్ట మొదటి ముస్లీం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 125వ వర్ధంతి మరియు మాన్యశ్రీ కాన్షీరామ్ 19 వ వర్ధంతి