Wednesday, 25 March 2026
  • Home  
  • భాద్యతగా పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది: సీపీ అంబర్ కిషోర్ ఝా
- తెలంగాణ - పెద్దపల్లి

భాద్యతగా పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది: సీపీ అంబర్ కిషోర్ ఝా

*భాద్యతగా పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది* *_రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా_* రామగుండం, జులై 22, పున్నమి ప్రతినిధి: వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి జోన్ పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ కి స్టేషన్ పోలీస్ అధికారులు పుష్ప గుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసుల వివరాలను తెలుసుకొని పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ లోని పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు, ముఖ్యమైన ప్రదేశాలు, ఈ ప్రాంతంలోని మావోయిస్టులు, వారి కుటుంబ వివరాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఏవిదంగా నియంత్రణ చేయాలనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ స్టేషన్ రికార్డ్స్, హిస్టరీ షీట్స్, మండల భౌగోళిక స్థితి, నేరాల నమోదు, కేసుల స్థితిగతులు, కోర్టు క్యాలెండర్, సాంకేతికత మొదలగు వాటిని పరిశీలించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలని సిబ్బందిని ఆదేశించారు. పారదర్శకంగా పోలీసింగ్ ఉండాలని ప్రజలకు పోలీసు సేవలను వేగంగా అందించాలని సిబ్బందికి తెలిపినారు. గంజాయి రవాణా, వినియోగం నిరోధించేలా బాధ్యతగా పని చేయాలని అన్నారు. పెట్రోలింగ్ పెంచాలని, డయల్ 100 కాల్స్ పై సిబ్బంది వేగంగా స్పందించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు పని చేయాలని అన్నారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రజలు సైబర్ మోసాలకు గురి కాకుండా అవగాహన కల్పించాలని కోరారు. భాద్యతగా పని చేసే సిబ్బందికి రీవార్డ్స్, ప్రోత్సాహకాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులకు స్పందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, బిట్లు, పెట్రోలింగ్ పగడ్బందీగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ తెలిపారు. ఇదే క్రమంలో పోలీస్ కమిషనర్ అధికారులతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఇంచార్జ్ ఏసీపీ శ్రీనివాస్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ డి. రమేష్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ ఐ వెంకటేష్, సిసి హరీష్ ఉన్నారు.

*భాద్యతగా పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది*

*_రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా_*

రామగుండం, జులై 22, పున్నమి ప్రతినిధి: వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి జోన్ పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ కి స్టేషన్ పోలీస్ అధికారులు పుష్ప గుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు.

ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసుల వివరాలను తెలుసుకొని పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ లోని పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు, ముఖ్యమైన ప్రదేశాలు, ఈ ప్రాంతంలోని మావోయిస్టులు, వారి కుటుంబ వివరాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఏవిదంగా నియంత్రణ చేయాలనే అంశాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పోలీస్ స్టేషన్ స్టేషన్ రికార్డ్స్, హిస్టరీ షీట్స్, మండల భౌగోళిక స్థితి, నేరాల నమోదు, కేసుల స్థితిగతులు, కోర్టు క్యాలెండర్, సాంకేతికత మొదలగు వాటిని పరిశీలించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలని సిబ్బందిని ఆదేశించారు. పారదర్శకంగా పోలీసింగ్ ఉండాలని ప్రజలకు పోలీసు సేవలను వేగంగా అందించాలని సిబ్బందికి తెలిపినారు. గంజాయి రవాణా, వినియోగం నిరోధించేలా బాధ్యతగా పని చేయాలని అన్నారు. పెట్రోలింగ్ పెంచాలని, డయల్ 100 కాల్స్ పై సిబ్బంది వేగంగా స్పందించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు పని చేయాలని అన్నారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రజలు సైబర్ మోసాలకు గురి కాకుండా అవగాహన కల్పించాలని కోరారు.

భాద్యతగా పని చేసే సిబ్బందికి రీవార్డ్స్, ప్రోత్సాహకాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులకు స్పందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, బిట్లు, పెట్రోలింగ్ పగడ్బందీగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ తెలిపారు.

ఇదే క్రమంలో పోలీస్ కమిషనర్ అధికారులతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఇంచార్జ్ ఏసీపీ శ్రీనివాస్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ డి. రమేష్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ ఐ వెంకటేష్, సిసి హరీష్ ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.