రామారెడ్డి, 13 నవంబర్ ,(పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భక్తులతో కలిసి ఇస్సానపల్లి, రామారెడ్డి వీధుల్లో జరిగిన రథయాత్రలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అగ్ని గుండాల కార్యక్రమంలో పాల్గొ ని స్వామివారిని దర్శించుకున్నారు. వేదపండితు లు ఆశీర్వదించారు.ఆయన భక్తులతో కలసి భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అనంతరం భక్తు లతో మదన్ మోహన్ మాట్లాడుతూ, “రామారెడ్డి మండలంలో శ్రీ కాలభైరవస్వామి ఆలయం అత్యం త పవిత్రమైనది, ప్రసిద్ధిగాంచిందని అన్నారు. ఈ ఆలయాన్ని ‘దక్షిణ కాశీ’గా అభివృద్ధి చేయడానికి త్వరలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామన్నా రు. ఈ పవిత్రక్షేత్రానికి ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నాయకులు తరచూ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందేలా సదుపాయాలు కల్పిస్తాం” అని తెలిపారు.“ఎమ్మెల్యే రామారెడ్డి వాడినే. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కాలభైరవస్వామి ఆలయం తో ముడిపడి ఉన్నాయని చెప్పారు. చిన్నతనంలో నే స్వామివారి ఉత్సవాలను చూసి, ఆద్యాత్మికలో పెరిగానని చెప్పారు. ఆలయ అభివృద్ధి కోసం నా కృషి నిరంతరం కొనసాగుతుంది” అని ఎమ్మెల్యే అన్నారు.వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలను పొందారని అన్నా రు. కార్యక్రమంలో వేదపండితులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


