జనగామ, అక్టోబర్ 21,పున్నమి జిల్లా ప్రతినిధి :
సరా పండుగ సందర్బంగా ఫార్మర్స్ వేల్ఫేర్ ఫౌండేషన్ (రైతు సంక్షేమ సంస్థ )ఆధ్వర్యంలో నెల్లూట్ల గ్రామం లోని నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు బియ్యం, పప్పు, నూనె, అటుకులు, గోధుమ పిండి పంపిణి చేయడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా విచ్చేసిన ప్రముఖ సైకోలోజిస్ట్,స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్,డైరెక్టర్ సనత్ ఇన్స్టిట్యూట్స్,
అంతర్జాతీయ ఇంగ్లీష్ కవి, రచయిత,జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత చేతుల మీదుగా వితరణ చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షులు నిర్వాహకులు వి. సోమేశ్వర్, సీష శ్రీధర్ తెలిపారు.ఈ సందర్బంగా మురళి మాట్లాడుతూ నిరుపేదలకు నిత్యావసర వస్తువులు వితరణ చేయడం చాలా గొప్ప విషయమని,సేవా భావమని సమాజం లో చాలా మంది స్వార్థం కొరకు డబ్బు కొరకు ఎంతటి దారుణనికైనా వెనకాడటం లేదని, ఇలాంటి రోజులలో మంచి సహృదయం తో ముందుకొచ్చిన రైతు సంక్షేమ సంస్థ స్వచ్ఛందంగా సరుకులు పంపిణీ చేసే విషయము చాలా గొప్పదని అన్ని దానాల కంటే అన్న దానం గొప్పదని, నిత్య నిత్యావసర సరుకులు నిరుపేద ఇళ్లు లేని కుటుంబాలకు ఇవ్వడం చాలా కరుణామయం అని కొనియాడారు.ఈ సందర్బంగా సీసా శ్రీధర్ టి ఆర్ పి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సంస్థ చేపట్టడం సమాజం లో కొంత మంది అయినా మారే అవకాశాలు ఉంటాయని తోటి మనిషిని ప్రేమ తో చూడాలని, మనకు తోచిన సహాయం చేయడం మానవ సేవయే మాధవ సేవా అని చెప్పారు. ఈ కార్యక్రమం లో నిరుపేద కుటుంబాల సభ్యులు శీలమ్మ, మౌనిక, ఎలీషా తదితరులు పాల్గొన్నారు.

