Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Jangaon

ప్రశాంతంగా ముగిసిన బతుకమ్మ సంబరాలు,అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన కమిషనర్ర్ రాజ శేఖర్ రెడ్డి

Punnami Newsroom Published: Updated:
ప్రశాంతంగా ముగిసిన బతుకమ్మ సంబరాలు,అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన కమిషనర్ర్ రాజ శేఖర్ రెడ్డి

జనగామ పట్టణంలో ప్రశాంతంగా బతుకమ్మ సంబరాలు – సహకరించిన ప్రజాప్రతినిధులు, ప్రజలకు మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు
————————————————————
జనగామ, అక్టోబర్ 19,పున్నమి జిల్లా ప్రతినిధి
జనగామ పట్టణంలో జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాలు ప్రజల సహకారంతో ప్రశాంతంగా, సంతోషకరమైన వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని జనగామ మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఈ వేడుకలు ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గౌరవ ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, మహిళలకు, యువతకు, పోలీసు శాఖకు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సహకారం, వివిధ శాఖల సమన్వయం వల్లే ఇటువంటి పండుగలను విజయవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని కమిషనర్ తెలిపారు. భవిష్యత్తులోనూ పట్టణంలో అన్ని పండుగలు, సామాజిక కార్యక్రమాలు ప్రజల సహకారంతో ప్రశాంతంగా, పర్యావరణహితంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ప్రజల సహకారమే పట్టణ అభివృద్ధికి, పండుగల విజయవంతమైన నిర్వహణకు ప్రధాన బలమని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పేర్కొంటూ, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ప్రశాంతంగా ముగిసిన బతుకమ్మ సంబరాలు,అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన కమిషనర్ర్ రాజ శేఖర్ రెడ్డి

ప్రశాంతంగా ముగిసిన బతుకమ్మ సంబరాలు,అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన కమిషనర్ర్ రాజ శేఖర్ రెడ్డి

ప్రశాంతంగా ముగిసిన బతుకమ్మ సంబరాలు,అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన కమిషనర్ర్ రాజ శేఖర్ రెడ్డి

ప్రశాంతంగా ముగిసిన బతుకమ్మ సంబరాలు,అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన కమిషనర్ర్ రాజ శేఖర్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *