సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి)
కాకినాడ జిల్లా రామవరం టోల్ ప్లాజా వద్ద పోలీసుల్ని చూస్తూ టోల్ గేట్ సిబ్బందిని ఢీకొడుతూ దూసుకెళ్లిన ఇన్నోవా వాహనం కలకలం రేపింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆ వాహనంపై “ఆన్ గవర్నమెంట్ డ్యూటీ” అని వ్రాయగా, పోలీసులు గంజాయి తరలిస్తున్న ముఠాగా అనుమానిస్తున్నారు. విజయనగరం నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న కారులో పోలీస్ యూనిఫారం ఉండడంతో, అది పోలీస్ అధికారికి చెందిన వాహనమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. టోల్ వద్ద ఆపేందుకు ప్రయత్నించిన జగ్గంపేటకు చెందిన పోలీస్ అధికారి ప్రయత్నాన్ని తప్పించుకుని వాహనం పారిపోయింది. దీనిపై ఏపీ పోలీసులు గాలింపు చేపట్టి దర్యాప్తు వేగవంతం చేశారు. వాహనంలోని వ్యక్తుల గురించిన సమాచారం సేకరణ కొనసాగుతోంది.


