ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్ చేస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విస్సన్నపేట పట్టణంలో ఉధృతంగా జరిగింది.
విస్సన్నపేటలో కోటి సంతకాల సేకరణ
శనివారం (నవంబర్ 8, 2025) నాడు విస్సన్నపేట పట్టణంలోని బీసీ కాలనీ షాది ఖానా సెంటర్లలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి మద్దతు కూడగట్టడంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వ నిర్ణయంపై తమ నిరసనను వ్యక్తం చేశారు.
విసన్నపేట జడ్పిటిసి సభ్యులు భీమిరెడ్డి లోకేష్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు నెక్కలపు వెంకట కుటుంబరావు, సర్పంచ్ సాదుపాటి నాగమల్లేశ్వరి, ఎంపీటీసీ గద్దల మల్లయ్య,
సీనియర్ జిల్లా నాయకులు శిరసాని ప్రకాష్, పల్లెపాము లక్ష్మయ్య, యరబర్ల నాంచారయ్య, బోనం మహేశ్వరరావు, వార్డు నెంబర్లు సానం సత్యవతి, కరీం, మైనార్టీ నాయకులు మైనార్టీ జిల్లా నాయకులు దస్తగిరి, మైనార్టీ మండల నాయకులు ఆలీ, బాజీ బాబా, టైలర్ బాజీ, షరీఫ్, తిరుపతి రెడ్డి, మేకల రవి, లాజరస్, రెడ్డి నటరాజ్, పెండెం విక్రం, సాదుపాటి కోటేశ్వరరావు, వెంగళ దుర్గాప్రసాద్, కోపల్లి జయకర్, సానం నాగేంద్ర రావు, గోపిశెట్టి శివ, రామాంజనేయులు, గంజినబోయిన ఆంజనేయులు, భారతి తదితర నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.


